ఆ విషయాలు అడగొద్దు ప్లీజ్‌ : రేణు దేశాయ్‌

Update: 2018-11-20 17:35 GMT
పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే. ఆమె సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను - తన అభిప్రాయాలను - కొన్ని కవితలను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. రేణు దేశాయ్‌ రాసిన కవితలు అన్ని కూడా ఒక పుస్తక రూపంలో రాబోతున్నాయి. తాను రాసిన కవితలను అనంత శ్రీరామ్‌ తెలుగులో అనువాదం చేశాడు. త్వరలోనే ఆ పుస్తకంను విడుదల చేయబోతుందట. ఆ సందర్బంగా రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో లైవ్‌ లోకి వచ్చింది. రేణు దేశాయ్‌ చాలా రోజుల తర్వాత లైవ్‌ లోకి రావడంతో ఆమె ఫాలోవర్స్‌ భారీ ఎత్తున ఆమెను ప్రశ్నలు అడిగేందుకు పోటీ పడ్డారు.

రేణు దేశాయ్‌ లైవ్‌ లోకి రాగానే ఎక్కువ శాతం మంది కూడా అఖీరా - ఆధ్యాలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు - ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు అంటూ కూడా కొందరు ప్రశ్నించారు. దాంతో ఆమె దయ చేసి పిల్లల విషయం - పెళ్లి విషయం అడగకండి - త్వరలోనే ఆ విషయాలను చెప్తాను. ప్రస్తుతానికి వేరే విషయాల గురించి ప్రశ్నించండి అంటూ రేణు దేశాయ్‌ అభిమానులను కోరింది. అయినా కూడా కొందరు అవే ప్రశ్నను సంధించడంతో ఆమె వాటిని స్కిప్‌ చేసింది.

రేణు దేశాయ్‌ పిల్లల గురించి ఒక్క మాట అభిమానులతో షేర్‌ చేసుకుంటే బాగుండేది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ పిల్లలు అవ్వడం వల్ల వారి గురించి తెలుసుకోవాలనే కోరిక అందరిలో కూడా ఉంది. అందుకే వారి గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి రేణు ఎందుకు వారి గురించి తెలియజేయకుండా ఉంటుందో అంటూ కొందను అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News