తొమ్మిదేళ్ల పాటు క‌మ‌ల్ హాస‌న్ పేరిటే ఆ రికార్డ్..!

Update: 2021-05-10 12:30 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్-  శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన‌ `భార‌తీయుడు` (9 మే 1996 రిలీజ్) సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లోనే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుద‌లై  అన్ని భాష‌ల్లోనూ రికార్డుల మోత మ్రోగించింది. తెలుగు- త‌మిళ్- క‌న్న‌డ‌- హిందీ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. క‌మ‌ల్ హాసన్-శంక‌ర్ కెరీర్ లోనే ఓ మైలురాయి చిత్ర‌మిది. మ‌రి ఈ సినిమా రికార్డులు కొన్ని ద‌శాబ్ధాల పాటు ప‌దిలంగానే ఉన్నాయా? అంటే అవున‌నే వెల్ల‌డైంది.

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్- సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్- మెగాస్టార్ చిరంజీవి న‌టులుగా స‌మ‌కాలీకులు. ఆ ముగ్గురు వారి సొంత భాష‌ల్లో భార‌తీయుడు రిలీజ్ నాటికి పెద్ద స్టార్లుగా వెలుగొందుతున్నారు. దాదాపు స‌మాన పారితోషికాలు అందుకుంటున్నారు. అయితే భార‌తీయుడు రికార్డుల‌కు ర‌జ‌నీ- చిరంజీవి సినిమాలు మ్యాచ్ కాలేక‌పోయాయి. భార‌తీయుడు రిలీజ్ త‌ర్వాత సౌత్ ఇండియాలో చిరంజీవి- ర‌జ‌నీకాంత్ న‌టించిన చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ  `భార‌తీయుడు` రికార్డుల్ని బ్రేక్ చేయ‌లేక‌పోయాయి. 90 వ ద‌శ‌కంలో పాన్ ఇండియా లెవ‌ల్లో కేవలం క‌మ‌ల్ ఒక్క‌డే స‌క్సెస్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. భార‌తీయుడు మాతృ భాష త‌మిళ్ లో `ఇండియ‌న్` టైటిల్ తో రిలీజ్ అవ్వ‌గా హిందీలో `హిందుస్తానీ ` టైటిల్ తో అనువాద‌మై అక్క‌డా సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది.

ఆ త‌ర్వాత ఈ రికార్డు ను కేవలం ర‌జ‌నీ న‌టించిన `చంద్ర‌ముఖి `ఒక్క‌టే బ్రేక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణాదిలో `చంద్ర‌ముఖి`(2005) ఒక్క‌టే `భార‌తీయుడు` బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన‌ట్లు చెబుతున్నారు. అంటే దాదాపు 9 సంవ‌త్స‌రాలు ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు ప‌ట్టింది. `న‌రసింహ` అప్ప‌ట్లో తెలుగు- త‌మిళ్ లో భారీ విజ‌యం సాధించినా ఆ హిట్ కేవ‌లం   కోలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. ఇక మెగాస్టార్ సినిమాల‌న్నీ కేవ‌లం మాతృ భాష‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కూ మెగాస్టార్ పాన్ ఇండియాపై దృష్టి సారించ‌లేదు. ఆయ‌న చేసిన సినిమాల్లో భారీ విజ‌యాలు కేవ‌లం టాలీవుడ్ కే ప‌రిమితమ‌య్యాయి.  మ‌రి మ‌ళ్లీ  `భార‌తీయుడు` లాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేయాలంటే క‌మ‌ల్ హాస‌న్-శంక‌ర్ ద్వ‌యం వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. అందుకే వీళ్లిద్ద‌రు భార‌తీయుడు2 (ఇండియన్ -2) అనే భారీ ప్ర‌యోగాన్ని చేస్తున్నారు. కానీ ర‌క‌ర‌కాల వివాదాల‌తో ఇది వాయిదా ప‌డింది. మ‌రోవైపు ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న శంక‌ర్ - రామ్ చ‌ర‌ణ్ సినిమా దేశంలో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News