అనుష్కని కావల్సి దూరం పెట్టారా?!

Update: 2015-07-09 15:30 GMT
బాహుబలికి ప్రభాస్‌, రానా ఎంత ముఖ్యమో అనుష్క కూడా అంతే ముఖ్యం. ఆ ఇద్దరు హీరోలు ఎంతగా కష్టపడ్డారో అనుష్క కూడా అంతే కష్టపడింది. వాళ్లతో సమానంగా కత్తి ఫైట్లు, గుర్రపుస్వారీలు నేర్చుకొంది.  ముగ్గురూ కూడా ఒకేసారి సెట్‌లోకి అడుగుపెట్టారు. తమన్నా మాత్రం సినిమా మొదలయ్యాక ఏడాదికి ఎంపికైంది. కానీ బాహుబలి ప్రమోషన్‌లో తమన్నా హడావుడే ఎక్కువైంది తప్పిస్తే అనుష్క ఊసే లేదు. సినిమా విడుదలకు ముందు రోజు ఆమె రంగంలోకి దిగొచ్చని భావించారంతా. కానీ  అది కూడా జరగలేదు. ఇంతకీ అనుష్క ఎక్కడుందా అని ఆరా తీస్తే... బ్యాంకాక్‌లో 'సైజ్‌జీరో' సినిమా హడావుడిలో ఉందని తేలింది.

    మూడేళ్లపాటు కెరీర్‌ని ఫణంగా పెట్టి బాహుబలి చేసిన అనుష్క ప్రమోషన్‌కి రాకపోవడమేంటి? ఇంత పెద్ద సినిమా చేసి కూడా తన కష్టాన్ని, అనుభవాల్ని  పంచుకోకపోవడానికి కారణమేమిటి? అనుష్కకీ, బాహుబలి టీమ్‌కి మధ్య ఏమైనా జరిగిందా? ఇలా ఎన్నో అనుమానాలు ప్రేక్షకుల్లో తలెత్తాయి. అయితే అనుష్కని రాజమౌళి అండ్‌ టీమ్‌ కావల్సి ప్రమోషన్‌కి దూరంగా పెట్టినట్టు తెలిసింది. అందరూ అనుమానపడుతున్నట్టుగా బాహుబలి టీమ్‌కీ, అనుష్కకీ మధ్య ఏం గొడవల్లేవు. తొలి భాగంలో అనుష్క కనిపించేది చాలా తక్కువట. కొన్ని సన్నివేశాలున్నప్పటికీ అందులో ఆమె డీగ్లామర్‌గానే కనిపిస్తుందట. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో అందమైన అనుష్క ముద్దు ముద్దుగా మాట్లాడటం చూసి ఎక్కువగా అంచనాలు వేసుకొంటే థియేటర్‌లో చూసి ప్రేక్షకులు నిరాశపడాల్సి వస్తుంది కదా అని జక్కన్న ఆమెని దూరం పెట్టారట. అవసరమైతే సినిమా విడుదలయ్యాక అనుష్కని రంగంలోకి దింపొచ్చనేది ఆయన ప్లానింగట!

Tags:    

Similar News