అవకాశాలు చేజారినా రూ.2 కోట్లకు తగ్గేది లేదంటోంది!

Update: 2020-11-12 17:47 GMT
ఈ ఏడాది కరోనా కారణంగా నిర్మాతలు చాలా నష్టపోయారు. వారి మేలు కోసం పారితోషికంలో కట్టింగ్‌ పెట్టుకోవాలంటూ చాలా మంది సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు పారితోషికం తగ్గించుకున్నా కొందరు మాత్రం పారితోషికంలో ఎలాంటి మార్పుకు ఒప్పుకోలేదు. కాని రష్మిక మందన్న మాత్రం తన పారితోషకంను అమాంతం పెంచేసింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కరోనా విపత్కర కాలంలో పారితోషికం పెంచడం ఏంటీ అంటూ ట్రోల్స్‌ వస్తున్నా కూడా ఆమె మాత్రం తగ్గేది లేదు అంటుంది.

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలతో సక్సెస్‌ లను దక్కించుకున ఈ అమ్మడు పుష్ప షూటింగ్‌ లో జాయిన్‌ కాబోతుంది. మరో వైపు శర్వానంద్‌ హీరోగా రూపొందబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా ఎంపిక అయ్యింది. ఇక ఈమె వద్దకు మరో రెండు మీడియం బడ్జెట్‌ సినిమాలు కూడా వచ్చినా వాటికి రెండు కోట్ల పారితోషికం డిమాండ్‌ చేయడంతో తప్పి పోయినట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పారితోషికం విషయంలో రాజీ పడకుంటే చేతి వరకు వచ్చిన ఆఫర్లు చేజారి పోయే అవకాశందని.. రష్మిక కాస్త పట్టు విడుపును చూపుతూ సినిమాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా అభిమానులు సూచిస్తున్నారు. మంచి కథ పాత్ర లభిస్తే తక్కువ పారితోషికాలకు గతంలో చాలా మంది నటించిన దాఖలాలు ఉన్నాయి. రష్మిక కూడా అలా ఆలోచించాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:    

Similar News