• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తాగుబోతును కాదు.....

తాగుబోతును కాదు.. ‘అర్జున్ రెడ్డి’ చేయలేను

By - Tupaki Desk
Update: 2018-01-30 12:30 GMT
2017లో ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్లో అంత చర్చనీయాంశమైన సినిమా ‘అర్జున్ రెడ్డి’. పొరుగు భాషల్లో కూడా ఈ సినిమా గురించి పెద్ద చర్చే నడిచింది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగా బాల దర్శకత్వంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మరోవైపు హిందీలోకి కూడా ఈ చిత్రం వెళ్తోంది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. షాహిద్ కపూర్ హిందీ అర్జున్ రెడ్డిగా కనిపించబోతున్నాడు. ఐతే ఈ చిత్రానికి బాలీవుడ్లో సరైన ఛాయిస్ ఎవరు అన్న చర్చ వచ్చినపుడు చాలామంది రణ్వీర్ సింగ్ ను చూపించిన మాట వాస్తవం.

సందీప్ ఆలోచనల్లో సైతం రణ్వీర్ సింగే ఉన్నాడట. అతను రణ్వీర్ ను సంప్రదించిన మాట కూడా వాస్తవమేనట. ఈ విషయాన్ని సూటిగా చెప్పలేదు కానీ.. పరోక్షంగా రణ్వీర్ సింగే వెల్లడించాడు. తన దగ్గరికి ఈ మధ్య ఒక కథ వచ్చిందని.. అది మంచి కథే అని.. ఐతే అందులో ఆల్కహాలిక్ గా కనిపించాల్సి రావడంతో తాను అంగీకరించలేదని రణ్వీర్ తెలిపాడు. తాను మెథడ్ యాక్టర్ అని.. ఏదైనా పాత్ర చేయాలంటే ఒరిజినల్ గా ఎలా ఉంటారో ప్రయత్నించి ఆ తర్వాత నటిస్తానని.. ఐతే తనకు మద్యం తాగే అలవాటు లేకపోవడంతో ఆల్కహాలిక్ క్యారెక్టర్ చేయలేనని చెప్పేశానని రణ్వీర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీన్ని బట్టి అతను నో చెప్పింది ‘అర్జున్ రెడ్డి’ రీమేకే అన్న విషయం స్పష్టమవుతోంది. నిజంగా రణ్వీర్ ఈ పాత్ర చేస్తే భలేగా ఉండేదన్నది బాలీవుడ్ వర్గాల అభిప్రాయం.
Tags:    
  • Ranveer Singh 
  • Arjun Reddy Remake 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS