• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారంలోనే 80 దాటేసిన...

వారంలోనే 80 దాటేసిన రాంచరణ్

By - Tupaki Desk
Update: 2018-04-06 09:29 GMT
 మార్చ్ 20న విడుదల అయిన రంగస్థలం మూవీ సెన్సేషనల్ రన్ కంటిన్యూ అవుతోంది. తొలి రోజు తొలి ఆట నుంచి అందరినోటా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను సవరిస్తోంది. తొలి వారం రోజుల వసూళ్లకే అనేక బడా ఇండస్ట్రీ హిట్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ దాటిపోయిందంటే.. రంగస్థలం రన్ ఏ స్టేజ్ లో ఉందో అర్ధమవుతుంది.

తొలి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా మెగాపవర్ స్టార్ మూవీ 80 కోట్లకు మించి షేర్ వసూళ్లను దాటింది. బాహుబలి మినహాయిస్తే.. గతంలో వారం వసూళ్ల రికార్డు ఖైదీ నంబర్ 150పేరిట 77 కోట్లతో ఉండేది. ఇప్పుడు తండ్రి రికార్డును.. కొడుకు చరణ్ 3 కోట్ల మార్జిన్ తో దాటేశాడు. అలాగే తెలుగు రాష్ట్రాల షేర్ వసూళ్ల విషయంలో కూడా రంగస్థలంకే రికార్డు దక్కింది. కేవలం తెలుగు స్టేట్స్ నుంచే తొలివారంలో 58 కోట్ల షేర్ ను వసూలు చేసింది రంగస్థలం.

రంగస్థలం తొలి వారం షేర్
నైజాం- రూ. 16.45 కోట్లు
సీడెడ్- రూ. 11.5 కోట్లు
నెల్లూరు - రూ. 2.08 కోట్లు
గుంటూరు రూ. 6.07 కోట్లు
కృష్ణా - రూ. 4.67 కోట్లు
వెస్ట్  4 కోట్లు
ఈస్ట్ - రూ. 5.25 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 8.02 కోట్లు
ఏపీ +తెలంగాణ తొలి వారం షేర్ - 58.05 కోట్లు
కర్నాటక - రూ. 6.25 కోట్లు
తమిళ నాడు -90 లక్షలు
రెస్టాఫ్ ఇండియా- 75 లక్షలు
యూఎస్ఏ - రూ. 10.70 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్- రూ. 3.50 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా తొలి వారం షేర్- 80.15 కోట్లు

మొదటివారం ముగిసేసరికి.. అత్తారింటికి దారేది.. జైలవకుశ లైఫ్ టైం వసూళ్లను దాటేసిన రంగస్థలం.. ఈ వారంలో జనతా గ్యారేజ్.. శ్రీమంతుడు రికార్డులను కూడా బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఫుల్ రన్ లో నాన్ బాహుబలి రికార్డులు అన్నీ రంగస్థలం పేరిట నమోదు కావడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికీ రంగస్థలంకు క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం.. రెండో వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మీద ఉండడం చూస్తుంటే.. చెర్రీ పరుగులు ఎంతవరకూ సాగనున్నాయో చూడాలి.
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam movie 
  • Rangasthalam Collections 
  • Telugu NEws 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS