యూత్ స్టార్ రెండు సినిమాలు ఏ వేదికపై రిలీజ్ చేస్తారో..!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'భీష్మ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కరోనా సంక్షోభం రాకముందు విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాగా 'భీష్మ' నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అనే సినిమా దాదాపుగా పూర్తి చేశాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ - కీర్తి జోడీ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థం అవుతోంది. థియేటర్స్ మూతబడి ఉండటంతో ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. నిజానికి 'రంగ్ దే' స్పెషల్ టీజర్ లో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే థియేటర్స్ రీ ఓపెన్ చేయడం మరింత లేట్ అవుతుండటంతో జీ స్టూడియోస్ వారితో ఓటీటీ డీల్ సెట్ చేసుకున్నారని టాక్ వచ్చింది. అయితే జీ స్టూడియో వారు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో 'రంగ్ దే' చిత్రాన్ని కూడా థియేటర్స్ లోనే విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు నితిన్ - దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'చెక్' చిత్రాన్ని కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ - ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ నిర్మించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ 'చెక్' ని కూడా అదే బాటలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే 'చెక్' మూవీ టాకీ పార్ట్ పూర్తి కాగా ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. థియేటర్స్ డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో తెరుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో యువ హీరో నితిన్ నటించిన 'రంగ్ దే' 'చెక్' సినిమాలు డిజిటల్ రిలీజ్ కి వెళ్తాయా లేదా థియేట్రికల్ రిలీజ్ కి వెళ్తాయా అనేది చూడాలి.