యంగ్ హీరో పెళ్లయ్యాక పాత స్నేహితురాలిని మరువలేదా?
దగ్గుబాటి రానా ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రిలీజైన తొలి సినిమా `అరణ్య`కు మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ ముందే అతడు తన పాత స్నేహితులకు గూడీస్ పంపాడు. అనుష్క-సమంత- త్రిష లకు అతడు గూడీస్ పంపగా వారంతా ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదివరకూ అనుష్క.. సమంత థాంక్స్ చెప్పగా.. ఈ రోజు త్రిష కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో రానా పంపిన కానుకలతో ఫోటోని షేర్ చేసి థాంక్స్ చెప్పారు. స్నేహితురాలు త్రిష ఆరణ్య పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. ``ఆర్డీ.. విష్ణు లకు అభినందనలు.. గూడీస్ కి ధన్యవాదాలు. కందన్.. రానా దగ్గుబాటి`` అని వ్యాఖ్యను జోడించారు. రానా తనకు తిరిగి ధన్యవాదాలు తెలిపారు.
రానా- త్రిష ఇండస్ట్రీలో దశాబ్ధ కాలంగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా స్నేహం పై రకరకాల పుకార్లు వచ్చాయి. వాటన్నిటికీ కాఫీ విత్ కరణ్ షోలో రానా ఆన్సర్ ఇచ్చారు. రాజమౌళి- ప్రభాస్ తో పాటు ఆ షోలో పాల్గొన్న రానా తమ మధ్య స్నేహం ఉందని అన్నారు. ఒక దశాబ్ద కాలంగా త్రిష నా స్నేహితురాలు అని రానా తెలిపారు. రానా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి పవన్ కళ్యాణ్ తో కలిసి అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్నారు. త్రిష పొన్నీయిన్ సెల్వన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.