రొమాంటిక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్న భల్లాలదేవ..!
దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన రానా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'లీడర్' సినిమాతో వెండితెరకు పరిచయమైన రానా కేవలం కథా బలమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తాచాటుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో భళ్లాల దేవుడుగా రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి రానా ఎప్పుటికప్పుడు విభిన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. రానా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'అరణ్య'. ఈ సినిమా తెలుగు తమిళ హిందీ బాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగులో 'అరణ్య'.. తమిళంలో 'కాదన్'.. హిందీలో 'హాథీ మేరే సాథీ'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినీమాకు సంబంధించి పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. మానవులు - జంతువుల ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి 'బన్ దేవ్' పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో సైలెంటుగా ఉన్న త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం వేణు ఉడుగుల దర్శకత్వంలో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ 'విరాట పర్వం' సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నది.
ఇదిలా ఉండగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రానా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు రానా. ఈ నేపథ్యంలో పూర్తి నిడివి గల రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో మిమ్మల్ని ఎప్పుడు చూస్తామని ఒక అభిమాని అడగగా త్వరలోనే ఫుల్ లెన్త్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నాని.. ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని రానా సమాధానంగా చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పాడట. అంతేకాకుండా ప్రొడ్యూసర్ గా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న కొన్ని చిత్రాలను బయటకి తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు కూడా చెప్పాడట. లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం వీటికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపాడట. కరోనా పరిస్థితులను బట్టి 'అరణ్య' సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడట.