ఈ పార్టులో ప్రభాస్-రానా యుద్దం లేదా?
బాహుబలిలో జనాలు ఏం చూడాలనుకుంటున్నారు? ఎందుకోసం ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఠకీమని సమాధానం చెప్పేస్తారు. రెండు భీకర ఆకారాలు ఢీకొడుతుంటే చూడాలనేదే ఆశ అని చెప్పేస్తారు ఎవరైనా. దీని ఉద్ధేశ్యం ప్రభాస్ - రానా కొట్టుకుంటుంటే తెరపై చూసి ఎంజాయ్ చేయాలన్నది కాన్సెప్టు. కానీ దీనికి బాహుబలి : ది బిగినింగ్‌లో ఆస్కారమే లేదని చెబుతున్నారు.
అంతేనా బాహుబలిని భళ్లాలదేవ చంపేస్తాడు. అది మాత్రమే తొలి భాగంలో చూపిస్తారట. ఆ తర్వాత ప్రతీకారంతో రగిలిపోయే శివుడు (ప్రభాస్) రెండో భాగంలో భళ్లాలదేవునిపై యుద్ధానికి వెళతాడని తెలుస్తోంది. అప్పుడు అసలైన క్లయిమాక్స్ ఉంటుందిలే. భళ్లాల దేవుని అంతు చూడడం అనేది రెండో భాగంలో మాత్రమే చూడగలమని చెబుతున్నారు. మరి తొలిభాగంలో ఇంకేం చూపిస్తున్నారు అన్న సందేహం అక్కర్లేదు.
ఈ పార్ట్‌లో ఎమోషనల్ కంటెంట్‌తో మహిష్మతి సామ్రాజ్యం, వీరత్వం గురించి చెబుతారు. భళ్లాలదేవ, కాళికేయల హవా చూపిస్తూనే క్లయిమాక్స్ వరకూ ఉద్వేగం రెట్టించేలా చేస్తారు. అసలు సిసలు రివెంజ్ ముందుంది అంటూ శుభం కార్డ్ వేస్తారన్నమాట! ఐదు గంటల సినిమాని రెండు భాగాలుగా చూపించాలి కాబట్టి తొలి భాగంలో సస్పెన్స్‌ని మెయింటెయిన్ చేయాలి కాబట్టి ఆ పనిచేశారన్నమాట!