నవాజుద్దీన్ సిద్దిఖి.. చంపేశాడబ్బా
మామూలు క్యారెక్టర్లోనే చెలరేగిపోతుంటాడు నవాజుద్దీన్ సిద్దిఖి. ఇకఅతడికి సైకో పాత్రలు పడితే ఇంకేమైనా ఉందా..? 1960 ప్రాంతంలో వరుస హత్యలతో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సైకో కిల్లర్ రామన్ రాఘవ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖి ఎలా తన విశ్వరూపం చూపించాడో ‘రామన్ రాఘవ్ 2.0’ ట్రైలర్ చూస్తుంటే అందరికీ అర్థమవుతోంది. ఇండియన్ సినిమాను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇంతకుముందు కశ్యప్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’లో నవాజుద్దీన్ సిద్దిఖి పాత్ర ఓ రేంజిలో పేలింది. అతడి నటనకు మెస్మరైజ్ అయిపోయారు జనాలు. ఇప్పుడు నవాజుద్దీన్ కెరీర్లో అత్యంత ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాలా కనిపిస్తోంది ‘రామన్ రాఘవ్ 2.0’.
ఏ కారణం లేకుండా ఊరికే అలా జనాల్ని చంపేసిన వాడు రామన్ రాఘవ్. బొంబాయిలో రోడ్డు మీద పడుకున్న అనాథల్ని.. ఏ అండా లేని వారిని ఎంచుకుని విచిత్రమైన ఆయుధాలతో పైశాచికంగా హత్య చేసేవాడు. రెండేళ్ల వ్యవధిలో అతను 41 మందిని చంపేయడం గమనార్హం. ఓ సందర్భంలో ఒకేసారి తొమ్మిది మందిని చంపేసి.. ఇంకో పది మందిని తీవ్రంగా గాయపరిచాడు రామన్ రాఘవ్. ఓసారి పోలీసులు అతణ్ని అరెస్టు చేసినా ఆధారాలు లేకపోవడంతో బయటపడిపోయాడు.
కానీ ఆ తర్వాత కూడా హత్యలు ఆపలేదు. చివరికి డీసీపీ రమాకాంత్ అతణ్ని అరెస్టు చేశాడు. యావజ్జీవ శిక్ష పడ్డాక 1987లో జైల్లోనే ప్రాణాలు వదిలాడు రామన్ రాఘవ్. వినడానికి ఒళ్లు గగుర్పొడిచే పాత్రను నవాజుద్దీన్ లాంటి నటుడు ఎలా చేసి ఉంటాడో అంచనా వేయొచ్చు. ట్రైలర్లోనే అతడి విశ్వరూపం కనిపిస్తోంది. ఇతణ్ని వేటాడి పట్టుకునే పోలీస్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను అనేక చిత్రోత్సవాలకు కూడా పంపిస్తున్నాడు కశ్యప్.
Full View