• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మిడతల దండు ట్వీట్స్.....

మిడతల దండు ట్వీట్స్.. వర్మకు మరో సినిమా దొరికినట్టేనా?

By - Tupaki Desk
Update: 2020-05-30 07:50 GMT
కాదేది రాంగోపాల్ వర్మ సినిమాలకు అనర్హం అన్నట్టుంది పరిస్థితి. ఏది ట్రెండింగ్ లో ఉంటే దానిపై సినిమాలు తీయడం మన వివాదాస్పద దర్శకుడు వర్మకు అలవాటు. అప్పట్లో రెండు రాష్ట్రాలను కుదిపేసిన ఎర్రచందనం స్మగ్లర్ ‘వీరప్పన్’ మీద సినిమా తీశాడు. అనంతరం రాయలసీమ ‘రక్తచరిత్ర’ను చూపించాడు. బెజవాడ రౌడీల ‘వంగవీటి’ని తీర్చిదిద్దాడు. ముంబైలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదుల దాడిని తీశాడు.

ఇలా ట్రెండింగ్ సబ్జెక్ట్ ను కథగా మలచడంలో వర్మది అందెవేసిన చేయి. ప్రస్తుతం మహమ్మారి సోకి రెండు నెలలుగా జనాలు నిర్బంధంలో ఉంటే ఆ మహమ్మారి మీదనే సినిమా తీసి తాజాగా ‘ట్రైలర్’ను కూడా వర్మ విడుదల చేశాడు. ఇప్పటికే కరోనావైరస్ పై కవితలు, పాటలు రాసిన వర్మ ఏకంగా ఓ రెండు పాటలు కూడా పాడి విడుదల చేసి అభిమానులను తన కర్ణకఠోర గొంతుతో భయపెట్టాడు.  ఇలా వర్మకు సబ్జెక్ట్ దొరికితే చాలు అలా నెలలో సినిమాలు తీసి రిలీజ్ చేస్తుంటాడు.

ప్రస్తుతం వర్మకు మరో సినిమా సబ్జెక్ట్ దొరికినట్టే కనిపిస్తోంది. తాజాగా ఆయన పొద్దున్నుంచి వరుసబెట్టి ట్వీట్లు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. మహమ్మారితో సతమతమవుతున్న ప్రభుత్వాలకు ఇప్పుడు మిడతల దండు దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. పంటపొలాలపై పెద్ద ఎత్తున తరలివచ్చి దాడులు చేస్తూ తింటూ భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి.

దీంతో వర్మ ప్రస్తుతం ‘మిడతల దండు’పై పడ్డారు. వైరస్ లు ప్రపంచంపై దాడిచేసిన అనంతరం మిడతలు అటాక్ చేస్తున్నాయని.. తదుపరి ఏలియన్స్ దాడులు చేస్తాయా? అని వర్మ ట్వీట్ చేస్తూ ‘మిడతల బీభత్సం’ వీడియోను షేర్ చేశారు. ఈ మిడతలను చూస్తుంటే ఈ లాక్ డౌన్ లో అవి ప్రపంచ పర్యటనలో ఉన్నాయి అంటూ సెటైర్ వేశారు.

దీంతో చాలా మంది నెటిజన్లు.. వర్మకు ‘మిడతలు’ మంచి సబ్జెక్ట్ గా దొరికాయని.. ఆయన వాటితో సినిమా తీయండి అంటూ వర్మకు సూచిస్తున్నారు. వర్మ వరుస ట్వీట్స్ చూస్తుంటే నిజంగానే మిడతలపై సినిమా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. మరి వర్మ ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.
Tags:    
  • Ram Gopal Varma 
  • Locust Attack 
  • India Lockdown 
  • Dangerous Disease 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS