మాట్లాడే మాటలు.. రాసే రాతలతో ఎంత ఇబ్బందన్న విషయాన్ని పోలీసుల విచారణలో స్వయంగా అనుభవించినట్లు చెబుతున్న ఆర్జేవీ అలియాస్ రాంగోపాల్ వర్మ.. తన ట్వీట్ల తీరును మార్చుకోలేదని చెప్పాలి. సామాజిక కార్యకర్త దేవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అభియోగంపై వర్మ పోలీసు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా జీఎస్టీ సినిమాకు దర్శకత్వం వహించారా? అన్నంతనే లేదన్న సమాధానం వర్మ చెప్పటం.. మరి అదే నిజమైతే.. ఇదేందంటూ టీజర్ ను ప్లే చేసి.. అందులో సగర్వంగా వేసుకున్న డైరెక్షన్ కార్డ్ ను పోలీసులు ప్రశ్నించిన తీరు వర్మను ఇబ్బందికి గురి చేసినట్లు చెబుతున్నారు.
సుమారు మూడున్నర గంటల పాటు పోలీసు విచారణను ఎదుర్కొన్న వర్మ.. మీడియాతో మాట్లాడేందుకు అస్సలు ఇష్టపడలేదు. కానీ.. ఇది జరిగిన కొన్ని గంటల అనంతరం తనదైన శైలిలో మళ్లీ పోస్టులు చేయటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తరచూ ట్వీట్లు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురయ్యే వర్మ తాజాగా తనకు పవన్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? అంటూ పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
తనకు పోర్న్ అంటే ఎంత ఇష్టమో.. పవన్ అంటే అంతే ఇష్టమని పోస్టు పెట్టిన వర్మ.. అందుకే తనకు పవన్ పోర్న్ కల్యాణ్ అని అదే అసలైన జీఎస్టీ అని ట్వీట్ చేసేశారు. పవన్ ఫ్యాన్స్ కు ఎంతగా మండాలో అందుకు తగ్గట్లు మాటల మసాలతో ట్వీట్లను రాసేసి జనాల మీదకు వదిలేశారు.
పోర్న్ కు.. పవన్ ను బ్రహ్మాండమైన పాపులార్టీ ఉందని.. పోర్న్ కల్యాణ్ అన్నది తిరుగులేని బ్రాండ్ అని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా పోర్న్ ను.. పవన్ ను అసమానంగా సమానంగా.. సమానంగా అసమానంగా ఇష్టపడతానని చెప్పారు. చివర్లో మీకు ఇష్టమైంది ఏది? పవనా? పోర్నా? అంటూ ఒక పోల్ పెట్టేసి ఎంచక్కా బజ్జున్నాడు వర్మ.
ఇక.. పోల్ ముచ్చటకు వస్తే ఇప్పటికి దగ్గర దగ్గర 18వేల మంది ఓటు వేసినట్లు ట్విట్టర్ పిట్ట చూపిస్తోంది. పవన్ కల్యాణ్ కు పోర్న్ కల్యాణ్ అన్న పేరు పెట్టిన వర్మ మరో వివాదానికి తెర తీశారనే చెప్పాలి. నిజమే.. సీసీఎస్ పోలీసులు ఏం అడిగారు? తానేం చెప్పానన్న విషయం మీద వర్మ పోస్టులు పెట్టలేని వేళ.. పవన్ పేరిట పోస్టులతో వర్మ తెలివిగా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.