చరణ్‌ కొత్త దోస్త్ ఇతనే అనమాట

Update: 2017-08-18 09:52 GMT
సినిమా ఇండస్ర్టీలో ఒక్కోసారి ఒక్కో పరిచయాలు ఒక్కోలా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని కొన్ని చిన్నగా మొదలై పెద్ద పెద్ద స్నేహాలు అయిపోతాయ్. ఇప్పుడు చూస్తుంటే మెగా పవర్ స్టార్ మొదలెట్టిన ఆ కొత్త స్నేహం చాలా కొత్త రేంజ్ కు వెళిపోయినట్లు ఉంది. రామ్ చరణ్ రీసెంటుగా ఒక దర్శకుడితో చాలా క్లోజ్ గా ఉండడం టాక్ ఆఫ్‌ ది టౌన్ అయిపోయింది.

మామూలుగా స్టార్ హీరోలను తమ సినిమాల ఈవెంట్లకు పిలుస్తూ.. దర్శకులు బాగానే కాలక్షేపం చేస్తుంటారు. కాని దర్శకుడు సురేందర్ రెడ్డికి సంబంధించిన చాలా ప్రైవేట్ ఈవెంట్లలో కూడా ఇప్పుడు తరచూ కనిపిస్తూ రామ్ చరణ్‌ తన కొత్త స్నేహాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. అతగాడితో ధృవ సినిమాను చేసిన చరణ్‌.. ఆ తరువాత మెగాస్టార్ 151వ సినిమా బాధ్యతను అతని చేతిలో పెట్టాడు. అంతలో సురేందర్ రెడ్డి కొడుకు బర్త్ డే కి.. అలాగే మొన్న అతను కొత్తగా నెలకొల్పిన రెస్టారెంట్ ఓపెనింగ్ కు చరణ్‌ విచ్చేశాడు. ఇక 151వ సినిమా ఓపెనింగులో కూడా సురేందర్ రెడ్డి బిడ్డను ఎత్తుకుని చరణ్‌ ఫోటోలకు ఫోజులిచ్చాడు. చూస్తుంటే ఈ కొత్త దోస్తీ ఇప్పుడు డీప్ గా వెళుతున్నట్లుందే అంటున్నారు సినిమా లవర్స్.

గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా.. కె.రాఘవేంద్రరావుతో ఇటువంటి దోస్తీనే కొనసాగించారు. ఇప్పటికీ వారు అదే రేంజ్ ఫ్రెండ్స్. అలాగే కొంతమంది యాక్టర్లతో కూడా చిరంజీవికి అలాంటి దోస్తీ ఉంది. మరి ఆల్రెడీ రానా అండ్ శర్వానంద్ తన ప్రాణ స్నేహితులు కాబట్టి.. ఇప్పుడు చరణ్‌ దర్శకుల్లో అలాంటి చిరకాల దోస్తీకి సురేందర్ రెడ్డిని ఎంచుకున్నట్లున్నాడు.
Tags:    

Similar News