'రియల్ మ్యాన్' అనిపించుకున్న రామ్ చరణ్...!
మన కోసం ఇంటి దగ్గర ఎంతో కష్టపడే భార్యలకు ఇప్పుడు మనం రుణం తీర్చుకునే సమయం వచ్చిందంటున్నారు టాలీవుడ్ స్టార్లు. ఈ క్రమంలో మహిళలకు పనిభారం తగ్గించేందుకు టాలీవుడ్‌లో వినూత్నమైన ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టారు. తమ ఇళ్లలోని మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టలేరని.. ఇంటి పనులు చేస్తూ సాయపడతారని వారే నిజమైన మనుషులంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ వేల ఇంట్లో అసలు సిసలు మనిషిగా ఉండండి అంటూ ‘బీ ద రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్ ను విసురుతున్నారు తెలుగు సినీ ప్రముఖులు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పిలుపు మేరకు ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇంట్లో పనిచేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా ట్విట్టర్ ద్వారా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. బట్టలు సర్దుతూ.. మాప్ తో ఫ్లోర్ క్లీన్ చేస్తూ.. మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు భార్య ఉపాసనకు కాఫీ పెట్టిచ్చారు. ''ఇంటి పనులు చేయడానికి గర్వపడదాం.. పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేసి రియల్ మ్యాన్ అనిపించుకుందాం..'' అంటూ పోస్ట్ చేసాడు. అంతేకాకుండా దర్శకుడు త్రివిక్రమ్ - బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ - రానా దగ్గుబాటి - శర్వానంద్ లను ఈ ‘బీ ద రియల్ మెన్’ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు.
సందీప్ రెడ్డి వంగా ‘బీ ద రియల్ మెన్’ పేరుతో రాజమౌళికి ఛాలెంజ్ చేయటం.. సందీప్ సవాల్ ను స్వీకరించిన రాజమౌళి.. తాను ఇంటి పనిని చేసి ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకి - కీరవాణి అలాగే డైరెక్టర్ సుకుమార్ కి కూడా ఛాలెంజ్ విసరడం.. ఎన్టీఆర్ చరణ్ లు తమ పని పూర్తి చేసి మిగిలిన స్టార్స్ కి ఛాలెంజ్ చేయడంతో ఇప్పుడు ఇది వరుసగా కంటిన్యూ అవుతుంది. ఎన్టీఆర్ విసిరిన ఈ ఛాలెంజ్ ని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ స్వీకరించారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఛాలెంజ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.