రకుల్ ఒంపులు కిర్రాక్
సైజ్ జీరో కోసం పాకులాటలో బొద్దుగుమ్మలు కాస్తా ఏదో అయిపోతున్నారన్న విమర్శలు తప్పడం లేదు. అయినా సైజ్ జీరో పిచ్చి ఏమాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ లో `జీరో సైజ్` బ్రాండ్ అంబాసిడర్ కరీనాకపూర్ స్ఫూర్తితో ఎందరో నవతరం పిచ్చెక్కి కొత్త రూపానికి మారారు. ఇప్పటికీ ఆ ప్రభావం యువతరంతో పాటు కథానాయికలపైనా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే పరిణీతి చోప్రా జీరో సైజ్ కి మారిపోయి అందరికీ షాకిచ్చింది.
ప్రస్తుతం పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ వంతు. ఈ అమ్మడు ఓ వైపు సౌత్ లో సినిమాలు చేస్తూనే ముంబై పరిశ్రమపై పూర్తిగా దృష్టి సారించింది. ఆ క్రమంలోనే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిలాప్ జవేరి తెరకెక్కించే భారీ సినిమాలోనూ అవకాశం అందుకుందని వార్తలొచ్చాయి. బాలీవుడ్ లో రాణించాలంటే అందుకు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. శరీర కొలతల పరంగా పూర్తిగా లెక్కలుంటాయి. ఆ లెక్కల ప్రకారం తన శరీరాన్ని విల్లులా వొంచేందుకు రకుల్ తీవ్రంగా శ్రమిస్తోంది. గత కొంతకాలంగా జీరో సైజ్ కోసం నానా ప్రయాసలు పడుతోంది. జిమ్ముల్లో నిరంతరం కసరత్తులు చేస్తూ ఆల్మోస్ట్ సైజ్ జీరో లుక్ కి వచ్చేసింది.
మారిన కొత్త లుక్ యూత్ కి కంటిపై కునుకుపట్టనివ్వదనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం. పరేషాను చేశానురా.. అంటూ రకుల్ తెలుగు యువతను పరేషాన్ చేసేసింది. ఇప్పుడు ఉత్తరాది యువతను పరేషాన్ చేసేందుకే ఈ ప్రిపరేషన్ అంతా. పూర్తి టైట్ ఫిట్ జిమ్ వేర్ లుక్ లో ఇలా దర్శనమిచ్చింది. హిందీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలగాలన్నది రకుల్ డ్రీమ్. అది నెరవేర్చుకునేందుకు ఈ సాహసం. బాలీవుడ్ లో అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడువకుండా తెలివైన ప్రణాళికలతో దూసుకుపోతోంది. ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో మైమరిపించనుంది. తమిళంలో బ్రదర్స్ సూర్య - కార్తీల సరసన నటిస్తోంది. ఎన్ జీకే - కార్తీ 17 లో రకుల్ కథానాయిక. బాలీవుడ్ లో `దే దే ప్యార్ దే` చిత్రంలో నటిస్తోంది. శివకార్తికేయన్ 14వ చిత్రంలోనూ రకుల్ కథానాయిక. అదీ సంగతి.