ఇదైనా ర‌కుల్ కి ప‌న‌వుతుందా?

Update: 2019-12-30 10:18 GMT
`వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో అనూహ్యంగా టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని అటుపై కెరీర్ ప‌రంగా బిజీ అయిపోయింది ర‌కుల్. మ‌హేష్‌- చ‌ర‌ణ్- ఎన్టీఆర్ స‌హా టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించేసింది. అటుపై హిందీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించింది. మ‌ర్జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. అటుపై కెరీర్ ప‌రంగా జెట్ స్పీడ్ తో ఎదిగేస్తుంద‌నే భావిస్తే హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఆశించిన‌ది ద‌క్క‌లేదు.

ఇటీవ‌ల `దే దే ప్యార్ దే` లాంటి అడ‌ల్ట్ కంటెంట్ సినిమాతో విజ‌యం అందుకుంది. అయితే 2019 ర‌కుల్ కి సౌత్ లో అస్స‌లు క‌లిసి రాలేదు. ఈ అమ్మ‌డు న‌టించిన `మ‌న్మ‌ధుడు-2` ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ అందుకుంది. తెలుగులో ర‌కుల్ కెరీర్ ప్ర‌స్తుతం ఖాళీ. అటు త‌మిళంలోనూ ఆశించిన అవ‌కాశాలేవీ లేవు.

ఆ క్ర‌మంలోనే హిందీ ప‌రిశ్ర‌మ‌లో అయినా అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయా? అంటే కొత్త‌గా ప్రాజెక్టులేవీ ఖ‌రారు కాలేదు. అయితే చాలాకాలంగా పెండింగులో ఉన్న `సిమ్లా మిర్చి` సినిమా ఇప్ప‌టికి రిలీజ‌వుతోంది. మొత్తానికి ఆర్థిక సంబంధ‌మైన వివాదాల్ని ప‌రిష్క‌రించుకుని రిలీజ్ కొస్తోంది. క‌నీసం ఈ సినిమా అయినా త‌న‌కు బ్రేకిస్తుందా.. ఆశించిన కెరీర్ కి బాట‌లు వేస్తుందా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News