రజినీని కలవడానికి లక్షన్నర ఖర్చు

Update: 2017-05-16 10:07 GMT
హీరోలకు అభిమానులు లక్షలు.. కోట్లల్లో ఉంటారు. హీరోలు అంతమందినీ కలవడం.. పలకరించడం.. వారితో ఫొటోలు దిగడం అన్నది సాధ్యమయ్యే పని కాదు. ఐతే కొందరు అభిమానులకు మాత్రం జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన హీరోను దగ్గరగా చూడాలని.. ఆ హీరోతో మాట్లాడాలని.. ఫొటోలు దిగాలని ఆశ ఉంటుంది. కొందరు వీరాభిమానులు ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమిళనాడుకు చెందిన జయశీలన్ తన అభిమాన కథానాయకుడైన రజినీకాంత్ ను కలవడానికి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సూపర్ స్టార్ ను కలవడానికి అతను లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టుకోవడం విశేషం.

రజినీని ఒక్కసారైనా కలవాలని.. ఆయన పక్కన తన కుటుంబ సభ్యుల్ని నిలబెట్టి ఫొటో దిగాలని జయశీలన్ కు ఎన్నాళ్ల నుంచో కోరిక. ఐతే రజినీ ఇంటి దగ్గర.. చెన్నైలో ప్రయత్నిస్తే పని అవ్వలేదు. దీంతో జయశీలన్ మరో రకంగా ఆలోచించాడు. రజినీ ఓ సినిమా షూటింగ్ కోసం హాంకాంగ్ వెళ్తున్నట్లు తెలుసుకుని.. ఆయన టూర్ విశేషాలు తెలుసుకున్నాడు. ఆయన బస చేసే హోటల్ గురించి కూడా సమాచారం రాబట్టాడు. అంతే తన భార్యా పిల్లల్ని తీసుకుని హాంకాంగ్ టూర్ ప్లాన్ చేశాడు. హాంకాంగ్ వెళ్లి రజినీ బస చేస్తున్న హోటల్లోనే అతనూ గది తీసుకున్నాడు. అక్కడ ఒక రోజు రజినీ లాంజ్ లో తీరిగ్గా కూర్చుని ఉంటే కుటుంబంతో కలిసి ఆయన్ని కలిశాడు రజినీ. నేను మీ అభిమానిని.. మీ కోసమే ఇలా వచ్చాను అనగానే రజినీ ఆశ్చర్యపోయాడట. లేచి నిలబడి నమస్కరించి.. అతడి ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగి.. జయశీలన్ కొడుకు కోసం సినిమాల్లో మాదిరే కళ్లజోడు ఎగరేసే విన్యాసం కూడా చేశాడట రజినీ. తన కోసం ఇంత ఖర్చు పెట్టుకుని హాంకాంగ్ వచ్చినట్లు తెలుసుకుని రజినీ చాలా బాధపడ్డాడట కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News