`ఫ్యామిలీమ్యాన్` ద‌ర్శ‌కద్వ‌యంతో రాశీ ఖ‌న్నా బిగ్ డీల్

Update: 2020-12-29 08:10 GMT
అందాల రాశీ ఖ‌న్నా బాలీవుడ్ కి జంప్ అయిపోతోందా? అందుకు సీరియ‌స్ ప్ర‌య‌త్నాల్లో ఉందా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. ఈ భామకు ఇటీవ‌ల తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి. ఆ క్ర‌మంలోనే త‌మిళంలో సెటిల‌య్యే ప్ర‌య‌త్నం చేసింది. అక్క‌డ వ‌ర‌స‌గా సినిమాల్లో న‌టిస్తోంది. అయితే దీపం ఉండ‌గానే చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో భాగంగా అటు హిందీ చిత్ర‌సీమ‌పైనా దృష్టి సారించింద‌ట‌.

నిజానికి రాశీ బాలీవుడ్ లోనే కెరీర్ ప్రారంభించి సౌత్ కి వ‌చ్చింది. 2013 హిట్ చిత్రం మ‌ద్రాస్ కేఫ్ (జాన్ భాయ్)తో ముంబై ప‌రిశ్ర‌మ‌లో తెరంగేట్రం చేసిన రాశీ అవ‌స‌రాల‌తో ట‌చ్ లోకి రావ‌డంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌గ‌లిగింది. ఇక్క‌డ వ‌రుస‌గా సినిమాల్లో న‌టించింది. అయితే ఇటీవ‌ల కొన్ని ఫ్లాపులు ఇబ్బందిక‌రంగా మారాయి. ఇక్క‌డ అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు ద‌క్కుతున్నా కెరీర్ ప‌రంగా జోష్ ఏమంత లేక‌పోవ‌డంతో చాలా తెలివైన నిర్ణ‌యాలు తీసుకుంటోందిట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. రాశీ ఖ‌న్నా ద‌ర్శ‌క‌ద్వయం  రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించే వెబ్ సిరీస్ కి సంతకం చేసినట్లు సమాచారం. ఇందులో షాహిద్ కపూర్ కూడా ప్రధాన పాత్రలో న‌టిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ అన్ని భాష‌ల్లోనూ విజయవంతం కావడంతో సూపర్ పాపులారిటీ పొందారు. ప్ర‌స్తుతం రెండవ సీజన్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తాజా వెబ్ సిరీస్ స‌క్సెసైతే ఇక‌పై మరిన్ని బాలీవుడ్ ఆఫర్లతో ముంబై ప‌రిశ్ర‌మ‌లోనే అందాల రాశీ సెటిల‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ర‌కుల్ ప్రీత్ త‌ర్వాత ర‌ష్మిక మంద‌న కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టేస్తోంది. ఆ కోవ‌లోనే ఎంద‌రో సౌత్ భామ‌ల్లానే నేటి‌త‌రం భామ‌ల్లో  రాశీ ఖ‌న్నా బాలీవుడ్ లో పెద్ద స్టార్ డ‌మ్ అందుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌నే భావిస్తున్నారు.
Tags:    

Similar News