బుల్లితెర‌పై కూడా ఈ జోరేంది సామీ

Update: 2022-03-24 15:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా.. థియేట‌ర్ల‌లో త‌న స‌త్తాని చాటిన బ‌న్నీ అదే జోరుని ఓటీటీ వేదిక‌పై చూపించాడు. ఇప్పుడు బుల్లితెర‌పై కూడా ఎక్క‌డా త‌గ్గేదేలే అని త‌న క్రేజ్ ని మ‌రోసారి నిరూపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ న‌టించిన భారీ క్రేజీ చిత్రం `పుష్ప ది రైజ్‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించింది.

తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ ఓ రేంజ్ లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. మ‌రీ ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ మూవీ సాధించిన వ‌సూళ్లు బాలీవుడ్ మేక‌ర్స్ తో పాటు స్టార్స్ కి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఒక ప్రాంతీయ చిత్రం జాతీయ స్థాయిలో వ‌సూళ్ల సునామీని సృష్టించ‌డం చాలా వ‌ర‌కు ట్రేడ్ వ‌ర్గాలే ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఉత్త‌రాదిలో ఈ మూవీ 100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి రికార్డు సృష్టించింది.

అంతే కాకుండీ మూవీ సిగ్నేచ‌ర్ స్టెప్, ఊ అంటావా హుక్ స్టెప్‌, శ్రీ‌వ‌ల్లీ.. స్టెప్, త‌గ్గేదేలే డైలాగ్ వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ గా మారాయి. అంతే కాకుండా ఈ మూవీని ప్ర‌తీ స్టార్ సెల‌బ్రిటీ ఓన్ చేసుకుని ఇన్ స్టా రీల్స్ చేస్తూ మ‌రింత వైర‌ల్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే పుష్ప కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌చార క‌ర్త‌లుగా మారి మ‌రీ సినిమాని వైర‌ల్ అయ్యేలా చేశారు. కొంత మంది దీనిపై పెయిడ్ ప్ర‌మోష‌న్స్ అంటూ సెటైర్లు వేసినా సినిమాకు మాత్రం రావాల్సిన ప‌బ్లిసిటీ అయితే వ‌చ్చేసింది.

మునుపెన్న‌డూ ఏ తెలుగు చిత్రానికి రాని ప‌బ్లిసిటీ ఈ మూవీకి వ‌ర‌ల్డ్ వైడ్ గా ద‌క్కింది. దీంతో సినిమా ప్ర‌తీ ప్లాట్ పామ్ లోనూ త‌గ్గేదేలే అనే రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేసింది. థియేట‌ర్లలో వుండ‌గానే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. అక్క‌డ కూడా రికార్డు స్థాయి వీవ‌ర్ షిప్ తో దుమ్ము దులిపేసింది. తాజాగా బుల్లితెర‌పై టెలివిజ‌న్ లో ఈ మూవీని ప్రీమియ‌ర్ చేశారు. అక్క‌డ కూడా అదిరిపోయే టీఆర్పీతో `పుష్ప‌` త‌గ్గేదేలే అని మ‌రోసారి నిరూపించింది.

ఈ సినిమాకు బుల్లితెర‌పై రికార్డు స్థాయి రేటింగ్ న‌మోదు కావ‌డం విశేషం. ఈ మూవీకి 22.5 టీఆర్పీ రేటింగ్ న‌మోదైంది. అల వైకుంఠ‌పుర‌ములో` ఏకంగా 29.4 రేటింటిని సాధించించి రికార్డు నెల‌కొల్పింది. మ‌మేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` 19.2. ఉప్పెన 18, క్రాక్ 11.66 రేటింగ్స్ సాధించాయి. ఇలా టాప్ 5 రేటింగ్స్ సాధించిన చిత్రాల్లో ముందు వ‌రుస‌లో తొలి రెండు స్థానాల్ని బ‌న్నీ న‌టించిన చిత్రాలు సొంతం చేసుకోవ‌డం విశేషం. 
Tags:    

Similar News