సైమా లో సిక్స్ కొట్టి తగ్గేదేలే అనేసిన 'పుష్ప'
సౌత్ సినీ ప్రముఖులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం గత రాత్రి వైభవంగా జరిగింది. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్.. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ.. యశ్ ఇంకా సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు.
సైమా 2022 అవార్డు వేడుకల్లో పుష్ప సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ సినిమాగా పుష్ప సినిమా కు గాను మైత్రి మూవీ మేకర్స్ వారు అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా పుష్ప సినిమాకు గాను సుకుమార్.. ఉత్తమ సంగీత దర్శకుడిగా పుష్ప సినిమా ఆల్బంకి గాను దేవిశ్రీ ప్రసాద్ సైమా అవార్డులను అందుకున్నారు.
ఇంకా ఉత్తమ సహాయ నటుడిగా పుష్ప సినిమాలోని కేశవ పాత్రలో నటించిన జగదీష్ కి అవార్డు దక్కింది. ఇక ఉత్తమ పాటల రచయిత కేటగిరిలో పుష్ప సినిమా పాటకు గాను చంద్రబోస్ అవార్డును దక్కించుకున్నాడు. మొత్తానికి ఈ ఏడాది అత్యధికంగా సైమా అవార్డులను సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప సినిమా నిలిచింది.
అవార్డుల్లోనే కాదు పుష్ప సినిమా వందల కోట్ల వసూళ్లను రాబట్టి కమర్షియల్ గా కూడా అద్భుత సినిమాగా నిలిచిన విషయం తెల్సిందే. నాలుగు వందల కోట్ల వసూళ్లు సాధించిన పుష్ప సినిమా యొక్క సీక్వెల్ కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ ని ప్రారంభించి వచ్చే సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.