• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాలిడ్ యాక్షన్ కోసం పుష్ప...

సాలిడ్ యాక్షన్ కోసం పుష్ప సాలిడ్ బడ్జెట్..!

By - Tupaki Desk
Update: 2021-04-19 10:32 GMT
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 20వ సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. మరి ఈ కాంబో హ్యాట్రిక్ అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే సాలిడ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న పుష్పలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఆ లుక్కుకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. అయితే ఆ టీజర్ బట్టి చూస్తే ఈ సినిమాలో పుష్పారాజ్ పాత్రలో యాక్షన్ ఓ రేంజిలో ఉండబోతుందని అర్ధమవుతుంది.

అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండగా.. భారీ యాక్షన్ సీక్వెన్సులు ఇందులో పుష్కలంగా ఉన్నాయట. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాలలో తెగవైరల్ అవుతోంది. ఏంటంటే.. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసమే దాదాపు 39కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్. అసలే సుకుమార్ పై అపారమైన నమ్మకంతో ఉన్నారు మైత్రి మూవీస్ నిర్మాతలు. మరి ఆయనతోనే సినిమా అంటే ఖచ్చితంగా ఖర్చు విషయంలో అసలు తగ్గరనేది వాస్తవం. ఇప్పటికే ఈ కాంబినేషన్ వరుస విజయాలలో ఉంది. రంగస్థలం, ఉప్పెన లాంటి సాలిడ్ హిట్స్ తర్వాత పుష్ప సినిమా రాబోతుంది. మరి ఫ్యాన్స్ అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 13న సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Tags:    
  • Allu Arjun 
  • Pushpa 
  • Tollywood 
  • Pushpa Movie Updates 
  • Telugu News 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS