వారికి సెల్యూట్‌ చేసిన పూరి

Update: 2020-10-05 04:15 GMT
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ ఈమద్య కాలంలో వివిధ అంశాలపై పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అందులో భాగంగా తాజాగా ఆయన మీడియా వారు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశాడు. దేశంలో రోజుకు ఎన్నో చోట్ల ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాని కొందరు మీడియా వారు మాత్రమే వారి కోసం పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా బర్కత్‌ దత్‌.. తనుశ్రీ పాండే.. ప్రతిభ మిశ్ర వంటి జర్నలిస్ట్‌ లు మాత్రమే అమ్మాయిల కోసం పోరాటం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై కూడా పూరి స్పందించాడు.

ఆడవారి కోసం పోరాటం చేస్తున్న ఆ జర్నలిస్ట్‌ లకు పూరి సెల్యూట్‌ చేశారు. కేవలం కొందరు జర్నలిస్ట్‌ లు మాత్రమే సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఆడవారి కోసం కేవలం ఆడవారు మాత్రమే పోరాడుతున్నారు. మగవారు మరియు ఇతర మీడియా సంస్థలు అన్ని కూడా పండుగ చేసుకునే పనిలో ఉన్నాయి. కొన్ని రోజులు ఆత్మహత్య పండుగ. సుశాంత్‌ మృతి చెందిన సమయంలో ఇంకా 300 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి  ఇతరుల ఆత్మహత్యల గురించి పట్టలేదు.

మీడియా మరో పండుగ నెపొటిజం. స్టార్‌ వారసుల సినిమాలపై విమర్శలు చేస్తున్నారు. కొత్త హీరోలు లేదా కొత్త వారు చేసిన సినిమాలను వెళ్లి చూస్తారా. కొత్త వారి సినిమాలను ఎవరు చూడరు. కేవలం స్టార్స్‌ సినిమాలను మాత్రమే చూస్తారు. అలాంటి వారికి నెపొటిజం గురించి మాట్లాడే అర్హత లేదంటూ పూరి అన్నాడు.

Full View
Tags:    

Similar News