ఒక ఫోటోతో పూరీ చాలా చెప్పాడే

Update: 2016-07-26 05:25 GMT
డైలాగ్స్ విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ని మించినోడు లేడనేందుకు  ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఒకటే ఒక్క మాటతో చాలా డెప్త్ వచ్చేలా డైలాగ్ చెప్పించడంలో పూరీ పండిపోయాడు. 'నేను పది సీన్లతో చెప్పాల్సిన భావాన్ని పూరి ఒకే డైలాగ్ తో చెప్పేస్తాడు' అని రాజమౌళి స్వయంగా పొగిడాడంటే.. ఈ డైరెక్టర్ ట్యాలెంట్ అర్ధమవుతుంది. అలాంటి పూరీ.. ఇప్పుడు ఒకే ఒక్క ఫోటోతో చాలా అర్ధాలు చెప్పేందుకు ట్రై చేశాడు.

పూరీ జగన్నాథ్ రీసెంట్ గా తన సోషల్ సైట్లలో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో పుర్రె బొమ్మలు.. వాటి కింద మతాలు.. కులాలు.. లింగ బేధాలు.. సమాజంలో స్థాయిలు  రాసి ఉంటాయి. తీరా పరీక్షగా గమనిస్తే.. అన్ని పుర్రెల ఒకేలా ఉన్నాయనే విషయం అర్ధమవుతుంది. అంటే.. మతాలు వేరైనా.. కులాలు వేరైనా.. వారి జెండర్ ఏదైనా.. పేద ధనిక లాంటి బేధాలున్నా.. ఆఖరికి నువ్వైనా నేనైనా అంతర్గతంగా ఇలానే.. ఒకలానే ఉంటాం. ఇదీ పూరీ చెప్పదలచుకున్న మాట. కానీ రైటర్ కం డైరెక్టర్ కదా.. అందుకే క్రియేటివ్ గా ఇలా తన ఫీలింగ్ ని చెప్పాడన్న మాట.

దేశంలో అయినా.. ప్రపంచంలో అయినా ఉగ్రవాదం.. అంతరాలు లాంటివి పేట్రేగిపోతున్న సమయంలో.. సమాజ హితం కోసం.. పూరీ వారు జారీ చేసిన ఓ కొటేషన్ కం స్టేట్మెంట్ లాంటిది ఈ ఫోటో.
Tags:    

Similar News