పూరి మాట్లాడితే జాతీయ అవార్డులంటున్నాడు

Update: 2016-10-21 05:18 GMT
పూరి సినిమాలలో హీరో అంటే నేటి తరం యూత్ కి బ్రాండ్ అంబాసిడర్ లానే. అమ్మాయిలకు సైటేసినా, విలన్లను ఉతికేసినా, పక్కవాళ్ళపై పంచులేసినా అది నేటి యువత మ్యానరిజానికి ప్రతింబింబాలు. పూరి సినిమా హీరో లాంటి అబ్బాయిలకే అమ్మాయిలు పడతారనే స్టేజికి తీసుకొచ్చేశాడు.

 ఐతే ఈ మధ్య పూరి ధోరణి మారింది. హీరో కేవలం ఆకతాయి, జులాయిగా కాకుండా బాధ్యతని మోసే యువకుడిగా సైతం తెరపై చిత్రీకరిస్తున్నాడు. మొన్న కెమెరామెన్ గంగతో రాంబాబు, నిన్న టెంపర్ నేడు ఇజం.. ఈ సినిమాలలో పూరి హీరోలు సమాజం కోసం పాటుపడే వ్యక్తులే.

అయితే మారిన ఈ పూరి హీరోయిజానికి తగ్గట్టుగా పూరి మాటలు కూడా మారుతున్నాయి. సినిమా విడుదలకు ముందు ఇచ్చే ప్రమోషన్లలో తన హీరో సోషల్ రెస్పాన్సిబుల్ అని, సినిమాలో సెన్సిబుల్ యాక్టింగ్ చేసాడని ఈ దెబ్బతో జాతీయ అవార్డు వస్తుందని అప్పుడు పవన్ కి, ఇటీవల తారక్ కి ఇప్పుడు కళ్యాణ్ రామ్ కి అదే డైలాగ్ వేస్తున్నాడు. తన హీరోకి జాతీయ అవార్డు అందించడం పూరి కలలలో ఒకటేమో.
Tags:    

Similar News