• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దివంగత సూపర్ స్టార్‌ కోసం...

దివంగత సూపర్ స్టార్‌ కోసం మెగాస్టార్‌, యంగ్ టైగర్‌

By - Tupaki Desk
Update: 2022-02-26 07:30 GMT
కన్నడ దివంగత సూపర్ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్‌ చివరి సినిమా జేమ్స్ విడుదలకు సిద్దం అయ్యింది. ఆయన జయంతి సందర్బంగా మార్చి 17వ తారీకున కన్నడంతో పాటు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జేమ్స్ షూటింగ్ దాదాపుగా ముగిసిన తర్వాత పునీత్‌ రాజ్ కుమార్ మృతి చెందారు. బ్యాలన్స్ వర్క్ ను పూర్తి చేసి డబ్బింగ్‌ కార్యక్రమాలు నిర్వహించి సినిమా ను విడుదలకు సిద్దం చేశారు.

పునీత్‌ రాజ్ కుమార్‌ పాత్రకు డబ్బింగ్ ను శివ రాజ్ కుమార్‌ చెప్పిన విషయం తెల్సిందే. ఈ సినిమా లో పునీత్‌ రాజ్ కుమార్‌ తో పాటు ఆయన ఇద్దరు అన్నలు కూడా కీలక పాత్రల్లో గెస్ట్‌ లుగా కనిపించబోతున్నారని కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడింది. దాంతో సినిమా ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్‌ పుకారు షికారు చేస్తోంది. పునీత్‌ రాజ్‌ కుమార్‌ అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు కూడా హాజరు అయ్యే విధంగా జేమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను భారీ ఎత్తున హోసపేట లో నిర్వహించేందుకు రాజ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు జేమ్స్ సినిమా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

హోసపేట లో నిర్వహించబోతున్న జేమ్స్ ప్రీ రిలీజ్ వేడుకలో దాదాపు అన్ని ఇండస్ట్రీ ల నుండి కూడా ప్రముఖులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌ నుండి ఈ కార్యక్రమానికి మెగా స్టార్‌ చిరంజీవి మరియు ఎన్టీఆర్‌ లు హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరిగాయని అంటున్నారు. ఈవెంట్‌ సమయంకు మరో ఒకరు ఇద్దరు టాలీవుడ్‌ స్టార్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.

చిరంజీవి మరియు ఎన్టీఆర్‌ లకు పునీత్‌ రాజ్ కుమార్‌ సన్నిహితుడు. టాలీవుడ్ లో ఎంతో మందికి ఆప్తుడిగా.. మిత్రుడిగా కొనసాగిన పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతి చెందిన సమయంలో ఎంతో మంది మన స్టార్స్ బెంగళూరు వెళ్లి ఆయనకు నివాళ్లు అర్పించిన విషయం తెల్సిందే. వివిధ కారణాలతో చివరి చూపు చూడలేక పోయిన వారు ఆ తర్వాత అయినా బెంగళూరు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పునీత్‌ రాజ్ కుమార్‌ కు తెలుగు సినిమా పరిశ్రమతో మంచి సన్నిహిత్యం ఉంది. కనుక ఈ సమయంలో ఆయన గౌరవార్థం జేమ్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు తెలుగు సినిమా ప్రముఖులు వెళ్లడం అభినందనీయం. చిరంజీవి మరియు ఎన్టీఆర్‌ లు మాత్రమే కాకుండా ఇంకా కొందరు ప్రముఖ స్టార్స్ కూడా వెళ్లాలంటూ అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • PuneethRajkumar 
  • PuneethRajkumar Movies 
  • PuneethRajkumar Death 
  • PuneethRajkumar James Movie 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS