• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జనవరి 14న ప్రభాస్.. 13న...

జనవరి 14న ప్రభాస్.. 13న మహేష్..? మరి పవన్..?

By - Tupaki Desk
Update: 2021-07-31 08:49 GMT
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కోసం స్టార్ హీరోల మధ్య ఇప్పటి నుంచే పోటీ ఎక్కువైంది. 2022 ఫెస్టివల్ సీజన్ లో వస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి రానా దగ్గుబాటి తో కలిసి రానున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. ఇప్పటికే మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పోటాపోటీగా సంక్రాంతి కోసం బరిలో దిగుతుంటే ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ కూడా సంక్రాంతి అల్లుడిని అవుతానని అంటున్నారు.

మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ఐదు నెలల క్రితమే ప్రకటించారు. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 13వ తేదీని మహేష్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు శనివారం సాయంత్రం ఫస్ట్ లుక్ తో పాటుగా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని కూడా పండుగ బరిలో నిలుపుతున్నారు. ప్రభాస్ అందరి కంటే ముందుగా ఏకంగా విడుదల తేదీని కూడా ఇచ్చేసాడు. జనవరి 14న తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ - రానా కలిసి నటిస్తున్న 'అయ్యప్పనమ్ కొశీయుమ్' రీమేక్ ని ఏ డేట్ కి తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా సంక్రాంతి సీజన్ లో జనవరి 13 - 14 - 15 తేదీలలో సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పటికే రెండు డేట్స్ ని ఇద్దరు పెద్ద హీరోలు లాక్ చేసుకున్నారు కాబట్టి, అదే రోజున పవన్ సినిమా వచ్చే అవకాశం లేదు. ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు అంటే వసూళ్ళ పై చూపుతుంది. దీనిని బట్టి చూస్తే #PSPKRana చిత్రాన్ని ఈ రెండు సినిమాలను నాలుగైదు రోజులు ముందుగా కానీ, తర్వాత కానీ విడుదల చేస్తారని టాక్.

అలానే వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎఫ్ 3' చిత్రాన్ని కూడా సంక్రాంతి కి తీసుకురావాలని చూస్తున్నారు. నిన్న శుక్రవారం వెంకటేష్ మీడియా ముఖంగా తన సినిమా సంక్రాంతికి అని ప్రకటించేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా - 'ఎఫ్ 3' సినిమాల డేట్స్ పై అందరి దృష్టి పడింది. మరి త్వరలోనే వీటిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ప్రతి సంక్రాంతి కి సినిమాల మధ్య పోటీ అనేది మామూలే అయినప్పటికీ.. 2022 పండక్కి మాత్రం అన్నీ పెద్ద సినిమాలే వస్తుండటం విశేషం.
Tags:    
  • Ayyappan Koshyam 
  • Ayyappan Koshyam Remake 
  • Ayyappan Koshyam Pawan kalyan 
  • Ayyappan Koshyam Story 
  • Ayyappan Koshyam Shooting 
  • pspk28 

Similar News

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

Copyright @2026

Powered by Blink CMS