#PSPK 28.. ఇంతలోనే మరో శుభవార్త చెప్పాడే
ప్యాకేజీలతో సంబంధం లేకుండా తన వద్దకు పక్కా స్క్రిప్టు తీసుకుని పూర్తి క్లారిటీతో వచ్చే ఏ దర్శకుడికి అయినా ఓకే చెప్పడం పవన్ నైజం. ఇప్పటికే సాగర్ చంద్ర అనే నవతరం దర్శకుడి ని ఎంకరేజ్ చేసేందుకు ఓ రీమేక్ ప్రాజెక్టుకు కమిటైన పవన్ .. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించే సినిమా ఫైనల్ స్క్రిప్టు విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
2012లో `గబ్బర్ సింగ్` లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన హరీష్ కి పవన్ మరో మాట లేకుండా ఆఫర్ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేయాల్సిందిగా సూచించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తన 28వ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ హరీష్ కి ఆ విధంగా జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. ఈ క్రేజీ కాంబో మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా కోసం పక్కాగా ప్లాన్ ని డిజైన్ చేశారన్న గుసగుసలు వినిపించాయి.
లాక్ డౌన్ సమయంలో హరీష్ శంకర్ ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తాన్ని పవన్ కి వినిపించి ప్రాజెక్టును ఖాయం చేసుకున్నారు. సోషల్ డ్రామా కథాంశాన్ని హరీష్ వివరించిన తీరు పవన్ ను ఆకర్షించింది. ఆ తర్వాత పూర్తి స్థాయి స్క్రిప్టుపై హరీష్ పని చేశారు. ఇటీవలే పవన్ కు పూర్తి కథనం వినిపించాడు. పూర్తి స్క్రిప్ట్ తో పవన్ ని బాగా ఆకట్టుకున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుంది. పింక్ సహా మరో మూడు నాలుగు సినిమాలు పవన్ క్యూలో ఉన్న సంగతి తెలిసినదే.