రాక రాక పెద్ద ఆఫర్ వస్తే...

Update: 2017-04-23 12:17 GMT
స్ర్కీన్ ప్లే రైటర్ విక్రమ్ సిరి మొదటిసారిగా డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘టచ్ చేసి చూడు’ ఆల్రెడీ లాంచ్ అయింది. ఈ సినిమా నిర్మాణ పనులు కూడా చక చక సాగుతున్నాయి. రవితేజకి ఈ మధ్య సినిమా లు అన్నీ బెడిసి కొడుతున్నాయి కాబట్టి.. ఈసారి తన ఓల్డ్ ఫార్ములా పెద్దగా పని చేయదు కాబట్టి.. ఒక కొత్త ఫార్ములాతో ఈ సినిమా కోసం రంగంలోకి దిగుతున్నాడట.

ఇకపోతే టచ్ చేసి చూడు సినిమా కోపం ఇప్పటికే ఒక లీడ్ రోల్ కి రాశి ఖన్నా ఎంపిక అయైంది. ఇప్పుడు ఫిలిం నగర్లో వినిపిస్తున్న తాజా అప్డేట్ ఏంటంటే.. కంచె ఫేం ప్రగ్యా జైస్వాల్ ను మరో హీరోయిన్ గా తీసుకుందాం అనుకుంటున్నారట. అయితే అమ్మడు మాత్రం ఇంకా డేట్స్ సర్దుబాటు చేయగలిగింది లేనిదీ చెప్పట్లేదు. అమ్మడు ఇప్పుడు చాలా ప్రొజెక్ట్స్ లో తనమునకలై ఉంది. బోయపాటి శ్రీనివాస్ తో ఒక సినిమా.. మంచు విష్ణు తో మరొకటి జరుగుతున్నాయి. నక్షత్రం అనే మూవీ విడుదల కి సిద్దం అవుతుంది. ఇన్ని సినిమా లతో బిజీ గా ఉన్న అమ్మాయీ దగ్గర డేట్స్ దొరకడం కష్టం కదా.. మరే అదే చిక్కు ఇక్కడ.

అయితే ప్రగ్యా జైస్వాల్ కు ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలను బట్టి చూస్తే.. రవితేజ సినిమా చాలా పెద్ద సినిమా అయ్యే ఛాన్సుంది. సో ఈ ఆఫర్ ను అమ్మడు వదులుకోకపోతనే బెటర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News