సలార్‌ లో ప్రభాస్ లుక్‌ ఇలా ఉంటుందట

Update: 2020-12-29 10:10 GMT
యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో సలార్‌ సినిమా కోసం కండలు పెంచే పనిలో కూడా ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సలార్ సినిమా షూటింగ్‌ ను వచ్చే నెల నుండి మొదలు పెట్టబోతున్నారు. అందుకోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ప్రభాస్‌ లుక్‌ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్‌ లో కనిపించిన దాని కంటే అయిదు నుండి ఏడు కేజీల బరువు ఎక్కువగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

సలార్ సినిమాలో ప్రభాస్ లుక్‌ చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో కాస్త లుక్‌ ను మార్చబోతున్నాడు. సలార్‌ సినిమాలో ప్రభాస్‌ మీసాలతో కనిపించబోతున్నాడు. రెగ్యులర్‌ కంటే కాస్త ఎక్కువ మీసాలతో ప్రభాస్‌ సలార్‌ సినిమాలో కనిపిస్తాడని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తానంటూ ప్రశాంత్ నీల్‌ అంటున్నాడు. కేజీఎఫ్ 2 సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అవ్వడంతో సలార్‌ పై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి
Tags:    

Similar News