• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌భాస్ సెంటిమెంట్‌.....

ప్ర‌భాస్ సెంటిమెంట్‌.. `రాధేశ్యామ్` హిట్ అవ్వ‌డం ప‌క్కానా?

By - Tupaki Desk
Update: 2022-03-06 23:30 GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో సెంటిమెంట్ల‌కు కొద‌వే లేదు. ఒక్కొక్క‌రికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలాగే నేష‌న‌ల్ స్టార్‌గా స‌త్తా చాటుతున్న ప్ర‌భాస్‌ కూడా ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈయ‌న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఈ వింటేజ్ ప్రేమ క‌థా చిత్రంలో కృష్ణం రాజు, స‌త్య‌రాజ్, భాగ్యశ్రీ, జగపతిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యాన‌ర్ల‌పై రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం మార్చి 11న మొత్తం ఐదు భాషలలో విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి కాగా.. యూ/ఏ సర్టిఫికెట్‌ను ఈ మూవీ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల‌తో స‌హా మేక‌ర్స్ ప్రమోషన్స్ లో తలమునకలయ్యారు.

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్ర‌భాస్‌.. త‌న‌కున్న ఓ సెంటిమెంట్‌ను బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌న మాట్లాడుతూ.. `సత్యరాజ్ నా కట్టప్ప. ఆయనతో మిర్చి సినిమా చేశాను. సూపర్ హిట్ అయింది. ఆ త‌ర్వాత బాహుబలి చేయ‌గా.. అది వేరె లెవ‌ల్‌కి వెళ్లింది. ఇక ఇప్పుడు ఆయ‌న‌తో రాధేశ్యామ్ చేశాను. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని నేను న‌మ్ముతున్నా` అంటూ ప్ర‌భాస్ చెప్పుకొచ్చారు.

మ‌రి  నిజంగానే ప్ర‌భాస్ సెంటిమెంట్ వ‌ర్కోట్ అయ్యి రాధేశ్యామ్ ప‌క్కా హిట్ అవుతుందా..? లేదా..? అన్న‌ది చూడాలి. కాగా, పిరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా వస్తోన్న ఈ చిత్రానికి సౌత్ భాషల్లో జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌ణ్ సంగీతం అందించ‌గా హిందీకి మాత్రం స‌చిత్ బ‌ల్హరా, అంకిత్ బ‌ల్హ‌రా, మితున్, అమ‌ల్ మాలీక్, మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఎస్‌.ఎస్.త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
Tags:    
  • Prabhas 
  • Pooja Hegde 
  • Radheshyam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS