ప‌వ‌న్ వ‌ర‌ల్డ్ రికార్డ్ .. స్టామినా చూపించిన ఫ్యాన్స్

Update: 2020-08-17 04:00 GMT
స్టార్ హీరోల బ‌ర్త్ డేల‌కు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టార్ల విష‌యంలో ఈ సంద‌డి మ‌రీ ఎక్కువ‌. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ త‌మ ఫేవ‌రెట్ హీరో స్టామినా ఎలాంటిదో ఆవిష్క‌రించేందుకు పోటీప‌డుతున్నారు.

గోడ పోస్ట‌ర్ రోజుల్లో పిడ‌క‌లు వేసి స‌త్తా చూపించేవారు. కాల‌క్ర‌మంలో థియేట‌ర్ క్యూలైన్ లో చొక్కాలు చించుకుని నోటిదురుసుకు ప‌ని చెప్పి వీరాభిమానం చాటుకునేవారు. దాంతో పోలిస్తే మోడ్ర‌న్ డేస్ అభిమానం పూర్తిగా మోడ‌రేట్ అయ్యింది. అది డిజిట‌ల్లో సోష‌ల్ మీడియాల్లో వ్య‌క్త‌ప‌రుచుకునేదిగా మారింది. ఇటీవ‌ల బ‌ర్త్ డేల‌కు డీపీలు త‌యారు చేయ‌డం వాటిని సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేయ‌డం అనేది ట్రెండ్ గా మారింది.

మ‌హేష్ .. చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్.. ప్ర‌భాస్ వీళ్లంద‌రి ఫ్యాన్స్ చేసేది ఇదే. ఇటీవ‌లే మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సీడీపీ ప్ర‌మోష‌న్స్ లో ఫ్యాన్స్ రికార్డులు బ్రేక్ చేశారు. టాలీవుడ్ లో ఈ త‌ర‌హా ఫాలోయింగ్ లో మ‌హేష్ నంబ‌ర్ వ‌న్ అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డును కూడా చెరిపేశారు ప‌వ‌న్ అభిమానులు. దాదాపు 6కోట్ల 30ల‌క్ష‌ల ట్వీట్ల‌తో ట్విట్ట‌ర్ లో బెస్ట్ అభిమానులం మేమేన‌ని నిరూపించారు. ట్వీట్ల‌లో ప‌వ‌నిజాన్ని ఆవిష్క‌రించారు. గూగుల్ ట్రెండింగులో ఓ వైపు మాజీ టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ప‌ద‌వీవిర‌మ‌ణ వార్త‌లు జోరుగా వైర‌ల్ అవుతూ టాప్ పొజిష‌న్ లో ఉన్నా.. ఆ రికార్డును సైతం ప‌వ‌న్ బ‌ర్త్ డే సీడీపీ అధిగ‌మించింది. ట్వీట్ల‌తో మోతెక్కించారు అభిమానులు. ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ర్త్ డే సీడీపీ పేరుతో జోరుగా వైర‌ల్ చేశారు. ఈ స్థాయి ఫాలోయింగ్ ప్ర‌పంచ రికార్డు అనే చెప్పాలి. అయితే ఇదంతా ఒరిజిన‌ల్ గా జ‌రిగిన‌దే అయితే ఫ‌ర్వాలేదు. అలా కాకుండా ఫేక్ ప్ర‌వేశిస్తేనే చిక్కులు. అయితే ప‌వ‌న్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ రికార్డు స‌రైన‌దేన‌ని అంతా భావిస్తున్నారు.
Tags:    

Similar News