పోసాని చేత రివర్స్ గేర్ వేయిస్తున్నారట!

Update: 2019-03-18 17:11 GMT
సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'చిత్రలహరి'.  ఇంట్రెస్టింగ్ టీజర్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో నాలుగు పాత్రలే ఇంట్రో ఇచ్చారు కానీ మరో ఇంట్రెస్టింగ్ పాత్రను బయటపెట్టలేదట.  ఆ పాత్ర మరెవరిదో కాదు పోసాని కృష్ణ మురళిదే.

ఈ సినిమాలో పోసానిది కీలకమైన పాత్ర అని.. అసలు ఈ సినిమా స్టొరీలైన్ తండ్రికొడుకుల నేపథ్యంలో సాగుతుందని.. తేజుకు తండ్రి పాత్రలో పోసాని కన్పిస్తాడని సమాచారం.  పోసాని అనగానే..  ఆయన మహా హంగామా చేస్తాడని.. లౌడ్ కామెడీ ఉంటుందని ఫిక్స్ అయిపోవద్దు రాజా.  ఆయన ఇప్పటివరకూ చేసిన పాత్రలు అలాంటివే.. పైగా ఆయన ఎంత అతి చేస్తే ప్రేక్షకులకు అంత కిక్కు.  కానీ దర్శకుడు కిషోర్ తిరుమల మాత్రం పోసాని చేత రివర్స్ గేర్ వేయిస్తున్నాడట.

అంటే.. రెగ్యులర్ గా ఉండే లౌడ్ యాక్టింగ్ ఉండదట.  ఒక సాధారణ మధ్యతరగతి తండ్రిగా ఎంతో సౌమ్యుడిగా ఉంటాడట.  హంగామా లేకుండా ఉండే పోసానిని చూసే అలవాటు మనకు లేదు కాబట్టి ఖచ్చితంగా అది సర్ ప్రైజ్ గా ఉంటుందని టాక్.  నిజానికి ఈ పాత్ర పోసాని చేత చేయించాలనే ఆలోచనే ఎవరికీ రాదని..  ఫ్రెష్ గా ఉంటుందనే ఉద్దేశంతో కిషోర్ తిరుమల చెప్పగానే 'చిత్రలహరి' టీమ్ అందరూ ఎగ్జైట్ అయ్యారని అంటున్నారు. సో.. మీరందరూ శాంతమూర్తిగా ఉండే పోసానిని చూసేందుకు రెడీ అయిపోండి..!



Tags:    

Similar News