పోసాని కృష్ణమురళి అంటే ఓ ఫైర్ బ్రాండ్. ఆయన ఎవరికీ భయపడరు. మనసులో ఏదుంటే అది బయట పెట్టేస్తారు. ఎదురుగా ఎంతటివాడైనా సరే.. డోంట్ కేర్ అంటారు. నేను తప్పు చేయను, ఎదుటివాడు తప్పు చేస్తే ఊరుకోను అనే తత్వం ఆయనది. అందుకే ఆయన జోలికి వచ్చే ధైర్యం ఎవరూ చేయరు. రెమ్యునరేషన్ విషయంలోనూ అలాగే ఉంటాడాయన. సినిమాకి నేను చేయాల్సింది చేస్తా - నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అంటుంటాడు. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ పోసాని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. నన్ను ఒకతను భయపెడుతున్నాడంటూ ఎస్.ఆర్.నగర్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఆ విషయంలో ఇండస్ట్రీలో సంచనలంగా మారింది.
ఇంతకీ పోసానిని భయపెడుతున్న ఆ వ్యక్తి ఎవరని ఆరా తీస్తే నరేష్ అనే విషయం బయటికొచ్చింది. ఆ నరేష్ ఎవరు? ఏం చేస్తుంటాడు? పోసానితో ఎందుకు పెట్టుకొన్నాడు? అనే విషయాలకి మాత్రం జవాబు దొరకలేదు. కానీ ఆయన తరచుగా పోసానికి ఫోన్ చేసి దుర్భాషలాడుతున్నాడట. మెసేజ్ లతో విసిగిస్తున్నాడట. మామూలుగా అయితే పోసాని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడు. కానీ వ్యవహారం అక్కడిదాకా వెళ్లిందంటే పోసాని పరిష్కరించుకోలేని సమస్యే అయ్యుంటుంది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొంటారో చూడాలి.