విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ జీఎన్ రంగరాజన్(90) కన్నుమూశాడు. వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు(జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈరోజు సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపారు. సీనియర్ దర్శకుడి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా దర్శకుడు జీఎన్ రంగరాజన్ లోకనాయకుడు కమల్ హాసన్ తో ఎక్కువ సినిమాలు చేశారు. 'కాదల్ మీంగన్ ' 'మీందమ్ కోకిల' 'మహారసన్' 'కల్యాణరామన్' 'ఎల్లం ఇంబమాయం' వంటి పలు చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కాయి. వీటితో పాటు 'ముత్తు ఎంగల్ సొత్తు' 'పల్లవి మీందుమ్ పల్లవి' 'అడుత్తతు ఆల్బర్ట్' వంటి చిత్రాలకు రంగరాజన్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఆయన తనయుడు జీయన్నార్ కుమారవేలన్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతున్నారు. కుమారవేలన్ ప్రస్తుతం అరుణ్ విజయ్ హీరోగా 'సినం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.