కొందరు బాధ కొందరు సుఖం.. పూనం మళ్లీ సంచలన పోస్ట్‌

Update: 2021-05-01 04:17 GMT
టాలీవుడ్‌ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన పూనమ్‌ కౌర్ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లు రాకపోవడంతో తక్కువ సమయంలోనే కనిపించకుండా పోయింది. హీరోయిన్ గా ఆఫర్లు రాకున్నా కూడా ఈ అమ్మడు చేస్తున్న సోషల్‌ మీడియా ట్వీట్లు పోస్ట్‌ ల వల్ల మీడియాలో ఉంటుంది. పేరు పెట్టకుండా కొందరిని విమర్శిస్తూ చర్చనీయాంశం అయ్యే పూనమ్‌ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా వేలాది మంది మృతి చెందుతున్న ఈ సమయంలో పూనం ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తీరును ఆమె తప్పుబట్టింది.

పూనం సోషల్‌ మీడియాలో... ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూస్తున్నాం. వైధ్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో రాజకీయాలు చేస్తున్న మన నాయకుల తీరును గమనించవచ్చు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కొందరు సుఖంగా ఉంటే మరి కొందరు మాత్రం కష్ట పడుతూ బాధలను అనుభవిస్తున్నారు.

ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండాలి. కాని బాధపడే వారి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ పూనమ్‌ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా చెత్త రాజకీయాలు నడుస్తున్నాయని పూనం సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో కూడా పూనం నెట్టింట ఇలాంటి ట్వీట్స్ చేయడం జరిగింది. ఆమె ట్వీట్స్‌ కొన్ని ఆలోచింపజేసేవిగా కూడా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తుంటాయి. కొందరు మాత్రం పూనం పోస్ట్‌ లను విమర్శిస్తూనే ఉన్నారు.
Tags:    

Similar News