చిరుకు పవన్ నో.. రామ్ చరణ్‌కు ఎస్

Update: 2020-03-26 17:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదారేళ్లుగా ట్విట్టర్లో ఉంటున్నాడు. ఇన్నేళ్లలో ఆయనకు ట్విట్టర్లో భారీగానే ఫాలోవర్లు వచ్చారు. కేవలం పొలిటికల్, సోషల్ ట్వీట్లకే పరిమితం అవుతున్నప్పటికీ ఫాలోవర్ల సంఖ్య 40 లక్షలకు చేరువగా ఉంది. ఐతే పవన్ మాత్రం నిన్నటి దాకా కేవలం 13 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. కొత్తగా పవన్ 14వ వ్యక్తిని అనుసరించడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి రామ్ చరణ్ కావడం విశేషం. చిరు బుధవారమే ట్విట్టర్లోకి అడుగు పెట్టగా.. తర్వాతి రోజే రామ్ చరణ్ కూడా ట్విట్టర్లోకి రంగప్రవేశం చేశాడు. నిజానికి ఈ అకౌంట్ పాతదే. కానీ చరణ్ అందులో యాక్టివ్‌గా లేడు. పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ట్విట్టర్లోకి పునరామగనం చేశాడు.

రాగానే తన బాబాయి స్ఫూర్తితో కరోనాపై పోరాటానికి రూ.70 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ సేవా దృక్పథం నచ్చిందేమో.. చిరు వెంటనే చరణ్‌ను ఫాలో అయిపోయాడు. ఇంతకుముందు పవన్ అనుసరిస్తున్న ఏకైక ఫిలిం సెలబ్రెటీ అమితాబ్ బచ్చన్ మాత్రమే. ఇప్పుడు చరణ్ తోడయ్యాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. నిన్ననే ట్విట్టర్లోకి అడుగు పెట్టిన తన అన్న చిరంజీవిని మాత్రం పవన్ అనుసరించట్లేదు. అన్నయ్య కొడుకును అనుసరిస్తూ.. అన్నయ్యను మాత్రం పవన్ విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు కారణాలేంటో తెలియదు మరి. చిరు వచ్చిన సంగతి పవన్‌కు తెలియకుండా ఉంటుందని అనుకోలేం. ఐతే రామ్ చరణ్ విరాళం ప్రకటిస్తూ తనను ట్యాగ్ చేశాడు కాబట్టి అతణ్ని వెంటనే అనుసరిస్తుండొచ్చు. చిరు హ్యాండిల్ కోసం ప్రత్యేకంగా వెతికి అనుసరించాలన్న ఆలోచన పవన్‌కు వచ్చి ఉండకపోవచ్చు.
Tags:    

Similar News