'ఆదిపురుష్' మొదలు పెట్టిన ప్రభాస్
ప్రభాస్ మొదటి హిందీ సినిమా 'ఆదిపురుష్' వచ్చే ఏడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ డిసెంబర్ వరకు ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసి ఆది పురుష్ సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. మొన్నటి వరకు రాధేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ చేసి వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. ముంబయిలోని టీ సిరీస్ ఆఫీస్ లో దర్శకుడు ఓం రౌత్ తో చర్చల్లో పాల్గొంటున్నాడు. ఈ సమయంలో కొన్ని సీన్స్ టెస్ట్ షూట్ మరియు కాస్ట్యూమ్స్ విషయమై చర్చలు జరుపుతున్నారట.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి గా కనిపించబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు వెండి తెరపై వచ్చిన రామాయణం మాదిరిగా కాకుండా ఓం రౌత్ చాలా విభిన్నంగా రామాయణంను ప్రజెంట్ చేయబోతున్నాడు. ఆది పురుషుడు అయిన రాముడిని కొత్తగా చూపించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. రావణుడి పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ను ఎంపిక చేసిన దర్శకుడు హీరోయిన్ పాత్రకు ఎవరు ఎంపిక అయ్యారు అనే విషయాన్ని వెళ్లడించలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబయిలో ఉన్న ప్రభాస్ తో పలువురు హీరోయిన్స్ ఫొటో షూట్ చేసి ఆ తర్వాత ఫైనల్ గా హీరోయిన్ ను నిర్ణయించే అవకాశం ఉంది అంటున్నారు.
మొత్తానికి ఆదిపురుష్ పనుల్లో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు. వచ్చే వారంలో మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చి రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. పూజా హెగ్డే కూడా ప్రభాస్ తో వచ్చే వారం రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలోనే రాధేశ్యామ్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆదిపురుష్ మాత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ క్లారిటీగా చెప్పేశాడు.