మాస్ లో ఎన్టీఆర్ సందడేది
మరికొద్ది గంటల్లో ఎన్టీఆర్ కథానాయకుడు సందడి మొదలుకాబోతోంది . తెలంగాణాలో తెల్లవారుఝామున వేసే షోల గురించి ఇంకా క్లారిటీ లేదు కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అనుమతులు రావడమే కాదు టికెట్ల అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఆశించినంత మేర ఊపు అడ్వాన్సు బుకింగ్ లో కనిపించడం లేదన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ముఖ్యంగా మాస్ బలంగా ఉండే సెంటర్స్ లో బయ్యర్లు కూడా షాక్ అయ్యేలా స్లో ట్రెండ్ కనిపించడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు.
బయోపిక్ కథ కాబట్టి ఇందులో మసాలా అంశాలు ఏమి ఉండవు. కేవలం ఎన్టీఆర్ పాత సినిమాల్లోని పాటలకు బాలయ్య స్టెప్స్ వేయడంతో పాటు పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో నిలదొక్కుకున్నాక ఎన్టీఆర్ జీవితం ఎలా సాగేది అన్న కోణంలోనే ఉంటుంది. ఒకవేళ నిజాలను ఉన్నదున్నట్టు చూపిస్తే కొంత వివాదంగా ఉండి ఆసక్తి రేగేది కాని స్వయానా బాలకృష్ణ నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఆ ఛాన్స్ కూడా లేదు.
రేపు ఏ పోటీ లేకుండా సోలోగా అధిక స్క్రీన్లలో విడుదల అవుతున్న బెనిఫిట్ ని ఇలా అయితే వాడుకోవడం కష్టమే. పైగా హైదరాబాద్ లో మొదటి షో పడే సమయానికే ఏపి నుంచి రిపోర్ట్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడి నుంచే ప్రచారం మొదలైపోతుంది. బాలయ్యకు ఎప్పుడూ అండగా నిలిచింది మాసే. గత దశాబ్ద కాలంలో చెప్పకోదగ్గ హిట్స్ గా నిలిచిన లెజెండ్ సింహాలు ఆడింది వాళ్ళ ఆదరణ వల్లే. గత జైసింహ సేఫ్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళే. ఈ నేపధ్యంలో మాసే ఆసక్తి చూపకపోతే 72 కోట్ల మినిమం టార్గెట్ పెట్టుకున్న కథానాయకుడు గట్టెక్కడం కష్టం. ఫైట్లు ఉండవు. అరుపులు కేకలు ఉండవు. మాస్ కి కావలసిన ఇలాంటి ఐటమ్స్ మిస్ అయినప్పుడు సహజంగానే హైప్ తక్కువగా ఉంటుంది. మరి కథానాయకుడు ఈ గండం నుండి ఎలా గట్టెక్కుతాడో చూడాలి
Full View