రెండు నెలలు ఆలస్యంగా ఎన్టీఆర్30
ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్‌ఆర్' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ 30 మూవీ అధికారిక ప్రకటన వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. కరోనా కారణంగా ఇంకా ఆర్ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో ఎన్టీఆర్ 30 మూవీ వాయిదా పడుతూ వస్తుంది. కొన్ని రోజుల క్రితం నిర్మాణ సంస్థ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి మార్చిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా అనధికారికంగా తెలియజేశారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం కాబోతుందట.
ఇండస్ట్రీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 మూవీని మే 20వ తారీకున ప్రారంభించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఎన్టీఆర్ బర్త్ డే అయిన మే 20 రోజున సినిమాను లాంచనంగా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ ను కూడా అదే రోజు నుండి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పలు టైటిల్స్ ను పరిశీలిస్తున్నాడు. అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ఎక్కువ రోజులు వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం త్రివిక్రమ్ మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ మరియు మాటలు అందిస్తున్నాడు. పవన్ మరియు రానాలు కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను త్రివిక్రమ్ మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దాంతో ఈసారి అయినా నందమూరి ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్ ను ఇస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.