నిఖిల్.. జాగ్రత్త పడకపోతే కష్టమే!

Update: 2023-06-02 11:37 GMT
కొంత కాలంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూ సత్తా చాటుతోన్న తెలుగు యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ప్రయోగాత్మక చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. 'కార్తికేయ 2' తర్వాత మరింత స్పీడు పెంచేసిన టాలెంటెడ్ హీరో నిఖిల్.. ఏకధాటిగా పాన్ ఇండియా చిత్రాలనే లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.

త్వరలోనే యంగ్ హీరో నిఖిల్ 'స్పై' మూవీతో రాబోతున్నాడు. దీని తర్వాత అతడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ వెంటనే రామ్ చరణ్ నిర్మాణంలో 'ది ఇండియా హౌస్'లో నటిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఆ తర్వాత నిఖిల్ 'స్వయంభు' అనే పిరియాడిక్ యాక్షన్ మూవీలో నటించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రకటన వచ్చింది.

మొగలుల కంటే ముందు పాలన సాగించిన రాజుల కథతో రాబోతున్న 'స్వయంభు' మూవీని ఠాగూర్ మధు నిర్మాణంలో భరత్ కృష్ణమాచారి తెరకెక్కించబోతున్నారు. దీనికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు తాజాగా వచ్చిన పోస్టర్‌లో ప్రకటించారు. మొత్తానికి ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఫస్ట్ లుక్ పోస్టర్ తర్వాత నిఖిల్ కొత్త సినిమా 'స్వయంభు' గురించి చాలా రకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో అతడి లుక్ ఏమాత్రం అతిగా లేకుండా ఆకట్టుకుంది. అందుకే ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, సినిమా విషయంలోనే భారీతనం లేకుండా జాగ్రత్తలు పడితేనే బెటర్‌గా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోన్నాయి.

నిఖిల్‌కు ఈ తరహా పిరియాడిక్ మూవీలు కొత్త కాబట్టి.. అతడు ఏమాత్రం అతి చేయకుండా ఉంటేనే 'స్వయంభు'ను ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కాకుండా సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఓవర్ హైప్ ఇస్తే ఇబ్బందులు తప్పవని కొందరు చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఏమైనా తేడా కొడితే నష్టాలతో పాటు ట్రోలర్స్‌కు నిఖిల్ బుక్కైపోతాడు.

కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే.. సినిమా ఫలితం ఎలా ఉన్నా అతడి ప్రయత్నానికి మంచి మార్కులు పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యంగ్ హీరో జాగ్రత్తగా అడుగు వేయాల్సిన అవసరం ఉంది.

Similar News