బెడ్ సీన్స్ ఉన్నాయని.. నో చెప్పిన స్టార్ ఫ్యామిలీ డాటర్
మెగా డాటర్ నిహారిక కొణిదెల.. ఈ మధ్య ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటున్నట్లు కన్పిస్తుంది. గతేడాది విడుదలైన ‘సూర్యకాంతం’ తర్వాత ఆమె మరో చిత్రం చేయలేదు. ‘సైరా నరసింహారెడ్డి’లో గిరిజన యువతి పాత్రలో మెరిశారంతే! నిహారిక మెగా డాటర్ కాబట్టి సినిమా అవకాశాలు రప్పించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ సొంతంగా కష్టపడి అవకాశాలు తెచ్చుకోవడమే తనకు ఇష్టమని చెబుతోంది. అయితే నిహరికకు కొన్ని సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయట.. కానీ నచ్చిన పాత్రల్లోనే నటిస్తానని నమ్మకంగా చెబుతోంది. అయితే తాజాగా నిహారికకు తమిళం నుంచి ఒక ఆఫర్ వచ్చిందట. అయితే ఆ పాత్రలో గ్లామర్ అండ్ రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉందని నో చెప్పేసిందట. బోల్డ్ బెడ్ సీన్ లో నటించడం సినిమాలో అవసరమే.. కానీ తన బ్యాక్ గ్రౌండ్ కారణంగా ఆ ఆఫర్ వదులుకుందని ఫిల్మ్ నగర్ లో టాక్.
ఇక మెగాస్టార్ చిరంజీవితో సైరాలో చేసిన నిహారిక త్వరలో ఆచార్య సినిమాలో కూడా మరొక కొత్త పాత్రలో కనిపించబోతోందట. నిహారిక తాజాగా ఓ తమిళ చిత్రానికి నిహారిక సంతకం చేసిందట. జాతీయ పురస్కార గ్రహీత సుశీంద్రన్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన స్వాతిని అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రంలో నిహారిక కథానాయికగా కనిపించనుందట. ఇందులో ‘పిజ్జా’ ఫేమ్ అశోక్ సెల్వన్ కథానాయకుడు. ‘‘అవును. తమిళ చిత్రం చేస్తున్నా. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నా’’ అని నిహారిక అన్నారు. రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. తమిళంలో నిహారికకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు విజయ్ సేతుపతి సరసన ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ చేశారు. ఇటీవల గ్లామర్ పాత్రలు చేయడానికీ తాను సిద్ధమేనని నిహారిక వెల్లడించిన విషయం తెలిసిందే..