బిపాసా అంత హాట్.. అయినా కానీ!
అందాల పోటీలు - ర్యాంప్ నుంచి టాప్ మోడల్‌గా ఓ వెలిగు వెలిగి అటుపై వెండితెరకు పరిచయమైంది నిధి శెట్టి. కె.జి.ఎఫ్ లాంటి భారీ చిత్రంతో ఐదు భాషల్లో ఒకేసారి పరిచయమైంది ఈ బ్యూటీ. అయితే నిధి శెట్టి అలికిడి టాలీవుడ్ లో లేకపోవడం పై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2016 మిస్ దివా గా ఎంపికైన ఈ టాప్ మోడల్ టాలీవుడ్ లోనూ బిగ్ కెరీర్ ఆశిస్తోందని ప్రచారమైంది. అయితే కె.జి.ఎఫ్ ఈ అమ్మడికి ఏమాత్రం కలిసి రాలేదని అర్థమవుతోంది. కెజిఎఫ్ ప్రీరిలీజ్ వేడుకలో ఆరడుల ఒడ్డు పొడవు ఉన్న ఈ బ్యూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీరకట్టులో సంప్రదాయ బద్ధంగా జేఆర్‌సీలో దిగింది ఈ అమ్మడు. అయినా కానీ.. అల్లంత దూరం అన్నట్టే ఈ భామకు సరైన ప్రమోషన్ లేకపోవడం చర్చకొచ్చింది.
కెజిఎఫ్ అన్ని భాషల్లో ఒకేసారి రిలీజవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ నిధి పాల్గొనలేకపోయింది. ఒక్క ప్రీరిలీజ్ మినహా ఆ తర్వాత ఈ భామ జాడైనా కనిపించలేదు. స్వతహాగానే సినిమా రిలీజవుతోంది అంటే ఇక్కడ టీవీ చానెళ్లు, మీడియాలోనూ కథానాయికల హల్ చల్ కనిపిస్తుంది. తనతో పాటే రిలీజ్ లకు వచ్చిన ఇతర సినిమాల కథానాయికలు సాయి పల్లవి - అదితీరావ్ హైదరీ - లావణ్య త్రిపాఠి వంటి నాయికలు మీడియా ఇంటర్వ్యూలు - ఇంటరాక్షన్స్ తో హడావుడి చేసినా నిధి ఎక్కడా కనిపించలేదు.
బిపాసా రేంజులో ఒడ్డు పొడుగు ఉన్నా రేస్ లో వెనకబడింది. ఇకపోతే నిధికి కెజిఎఫ్ లో అసలు ప్రాధాన్యత అన్నదే లేదు. భారీ మాఫియా - గ్యాంగ్ స్టర్ సినిమా కావడంతో ఏదో మూడు నాలుగు సన్నివేశాలు - ఒక పాట వరకే పరిమితమైంది. దీంతో అలిగిందో ఏమో.. అమ్మడు అస్సలు ప్రమోషన్స్ కి దూరమైంది. ఓవైపు కన్నడలో కెజిఎఫ్ హిట్టు అన్న టాక్ వినిపించినా - అక్కడా హడావుడి చేస్తున్నట్టే కనిపించలేదు. ఇకపోతే తెలుగు - తమిళంలో అయితే ప్రచారానికే రాలేదు. పనిలో పనిగా ఈ సినిమాలో మిస్ దివాకు మిల్కీ బ్యూటీ అస్సలు ఛాన్సే లేకుండా చేసిందన్న ప్రచారం సాగుతోంది. ఒకే ఒక్క క్లబ్బు సాంగ్ లో కనిపించిన తమన్నా థై షోస్ తో కుర్రకారు కళ్లకు అతుక్కుపోయింది. తమన్నా గ్లింప్స్ ముందు నిధి గ్లింప్స్ ఏమాత్రం కనబడకుండా పోయాయన్న టాక్ కూడా వినిపిస్తోంది.