బయటికి వచ్చి ఆ స్టార్ హీరో ఏం మెసేజ్ ఇస్తున్నాడు..?
కరోనా మహమ్మారి నుండి సడలింపులు లభించిన తర్వాత సినీ సెలబ్రిటీలు విచ్చలవిడిగా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లు మూతబడి ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కొందరేమో రాక రాక ఫ్రీడమ్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా ఒకరు. ఇటీవలే ఆయన తండ్రి రిషి కపూర్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం వలన రణబీర్ చాలా కుంగిపోయాడు. కొన్నిరోజుల వరకు తండ్రి జ్ఞాపకాలను తల్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అయితే మొన్నటి వరకు ముంబై నగరంలో కోలుకోలేని స్థితిలో మహమ్మారి తాండవం చేసింది. ఇప్పుడిప్పుడే నగరంలో మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.
తాజాగా స్టార్ ఫ్యామిలీ బిగ్ బి అమితాబ్ కుటుంబీకులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలిసి సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఖంగుతిన్నారు. కరోనా భారీగా పెరిగిపోతున్న ఈ సమయంలో హీరో రణబీర్ కపూర్ ఓ ప్రైవేట్ స్టేడియంలో సాకర్ గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఇలా రణబీర్ బయట ఆటలు ఆడుకుంటూ దర్శనమిస్తే అభిమానులకు ఏం సందేశం ఇస్తున్నాడని సినీవర్గాలు చర్చలకు దారి తీస్తున్నాయి. అందరూ హీరోలు తాము బయటికి రాకుండా వారి అభిమానులకు కూడా బయటికి రావొద్దని జాగ్రత్తలు చెప్తున్నారు. మరి రణబీర్ ఏంటి ఇలా ఏ జాగ్రత్తలు చెప్పట్లేదు.. అంతేగాక ఆయన కూడా బయట ఆటలు ఆడుకుంటున్నాడు. మరి ఆయన ఫాలోయర్స్ ఊరుకుంటారా.. అని నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై రణబీర్ ఏదైనా స్పందిస్తాడేమో చూడాలి!