అతనిది ఇంకా పాత అంబాసిడర్ ప్రయాణమే!

టాలీవుడ్ ట్రెండ్ మారిందిప్పుడు. ఔడెటెడ్ దర్శకులంతా రిటైర్మెంట్ ఇచ్చేయంతో! ట్రెండ్ కి తగ్గ డైరెక్టర్లని వెతికి పట్టుకోవడం కాస్త కష్టంగానే ఉంది. ఇప్పుడే సినిమా చేసినా థియేటర్ సహా ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అలాంటి కంటెంట్ ఉంటేనే కొత్త వాళ్లకి అవకాశాలు. నాలుగు పైట్లు..ఆరు పాటలతో కమర్శియల్ పార్మెట్ లో సినిమా చేద్దాం అంటే కుదరదు. పాత రోజులకి ఎప్పుడో రాం రాం పలికేసారు. ఇప్పుడొస్తున్న యువ నిర్మాతలు ఎంతో అప్ డేట్ గా ఉంటున్నారు.
ట్రెండ్ ఫాలో అయి ట్రెండ్ సెట్ చేసే కథలవైపు చూస్తున్నారు. సీనియర్లు సైతం చాలా మంది మారారు. స్టోరీల పట్ల అవగాహన పెంచుకోవాలని సురేష్ బాబు... దిల్ రాజు.. అల్లు అరవింద్ లాంటి సీనియర్లు హెచ్చరించడంతో! చాలా వరకూ మారారు. కాంబినేషన్ కంటే కంటెంట్ ఉన్న కథల్ని ప్రోత్సహించాలని కొందరు సీరియస్ గానే ఉన్నారు.
అందుకే సీనియర్ నిర్మాతలంతా తమ నిర్మాణ సంస్థలకి అనుబంధంగా పరిమిత బడ్జెట్ లోనూ కొన్ని సినిమాలు నిర్మించడానికి కొత్త సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఆ కోణంలోనే ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వి మెగా పిక్చర్స్' స్థాపించారు. ఇంకా నాని.. రవితేజ..మహేష్ లాంటి సూపర్ స్టార్లు కూడా నవతరం ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తూ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇదంతా మారిన వారి జాబితాగా చెప్పొచ్చు. అయితే పరిశ్రమలో మారని సీనియర్ల జాబితా కూడా ఒకటుందని తెలుస్తుంది.
ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్ సాక్షిగా ఆ సంగతి బయట పడింది. ఇంకా 20..30 ఏళ్ల క్రితం సక్సెస్ ల్ని చూసి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఓ నిర్మాత మాటల్ని బట్టి అర్ధమైంది.
వీళ్లంతా కొత్త వాళ్లని నమ్మడానికి బధులు అనుభవాన్ని నమ్ముతున్నట్లు క్లియర్ గా అర్ధమవుతుంది. కోట్ల రూపాయల పెట్టుబడి కొత్త వాళ్లని..అనుభవం లేని వాళ్లని నమ్మి నెత్తి మీద ఎలా పెడతాం? అన్న ధోరణిలో ఆయన విధానం కనిపించింది. పాత రోజులకి..కొత్త రోజులకి సారూప్యాన్ని ఆరకంగా చెప్పే ప్రయత్నం చేసారు. దీనిపై సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. మీరు ఇంకా పాత అంబాసిడర్ లోనే ప్రయాణం చేస్తున్నారు! సార్ అంటూ ఓ నెటి జనుడు కామెంట్ చేసాడు.