స‌ల స‌లా కాగ‌‌డంలో శ‌ర్మాగాళ్ త‌ర్వాతే

Update: 2020-12-31 12:30 GMT
ఇండియా క‌రోనాతో మ‌రుగుతుంటే నువ్వేమిటి అలా విహార యాత్ర‌ల‌కు బయ‌ల్దేరుతున్నావ్? అంటూ ఒక‌టే విరుచుకుప‌డుతున్నారు ఒక సెక్ష‌న్ అభిమానులు. అయినా శ‌ర్మా గాళ్ నేహా శ‌ర్మ‌ డేర్ గురించి ఇప్పుడే చెప్పాల్సిందేమీ లేదు. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్.. మంచు కొండ‌ల సెల‌బ్రేష‌న్ అంటే ప‌డి చ‌చ్చే ఈ అమ్మ‌డిని ఆప‌డం ఎవ‌రిత‌రం?

పైగా నూత‌న సంవ‌త్స‌రంలో అడుగు పెట్టే వేళ ఆ ఆనందానికి అడ్డూ ఆపూ ఉంటుందా?  లైఫ్ ఉన్న‌ది ఒక్క‌టే.. దానిని ఎంజాయ్ చేయ్ సోద‌రా! అని లిరిసిస్టులు నెత్తి నోరు కొట్టుకునేది ఎందుకని? అందుకే చాలా మంది మాల్దీవుల‌కు గోవా బీచ్ ల‌కు ప‌య‌న‌మ‌వుతుంటే నేహా మాత్రం డిఫ‌రెంటుగా ఇలా మంచు కొండ‌ల్లోకి వెళ్లిపోయింది.

అక్క‌డ ఒంట‌రిగా ఇలా సెల‌బ్రేష‌న్ ని ప్లాన్ చేసింది. మంచు కొండ‌ల్లో చిన్న‌పాటి గ‌డ్డి ప‌ర‌క‌ల‌పైనా ఆ మంచు బిందువుల్ని ఆస్వాధించ‌డ‌మెలానో త‌న‌కు మాత్ర‌మే తెలుసు. అన్న‌ట్టు ఈ విజిట్  నుంచి వేడెక్కించే ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తుంటే స‌న్నిహితుల స్పంద‌నా అంతే వేడెక్కించేస్తోంది.

నేహా క్యూట్ .. జార్జియ‌స్.. యూనిక్.. బ్యూటిఫుల్.. నైస్ అంటూ తెగ పొగిడేస్తున్నారు .. ఈమోజీల్ని షేర్ చేస్తున్నారు. స‌న్ లైట్ ఎఫెక్ట్ లో నేహా అందాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి అంటూ కొంద‌రు పొగిడేశారు. స్మైలీఫేస్ హార్ట్ స్ట్ర‌క్ స్టార్ హార్ట్ సేప్డ్ ఐస్ అంటూ ఈమోజీల్ని షేర్ చేస్తున్నారు.  `తానాజీ` లాంటి హిస్టారిక‌ల్ మూవీలో క‌థానాయిక‌గా న‌టించిన నేహాశ‌ర్మ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.
Tags:    

Similar News