• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్వరలోనే...

త్వరలోనే పెళ్లిపీటలెక్కుతా.. అంటున్న ప్రముఖ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2020-04-02 09:30 GMT
సౌత్ ఇండియన్ బాషలన్నింటిలో తన హవా చూపిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అన్నీ ఇండస్ట్రీలలో పెద్ద ఆఫర్లు దక్కించుకుంటూ పారితోషికాన్ని కూడా భారీగానే అందుకుంటుంది. దాదాపు పదేళ్ల పైగా సినిమాలలో అలరిస్తున్న నయనతార మొదట్లో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది.

గత కొన్నేళ్లుగా గ్లామర్ షో తగ్గించేసి పాత్రలను బట్టే సినిమాలు ఓకే చేస్తోంది. సినిమాల పరంగా టాప్ లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఆమెకు సంతృప్తి లేకుండా పోయింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ సంచలన నిర్ణయం తీసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నయనతార సౌత్ ఇండస్ట్రీలో మంచిపేరు సంపాదించుకుంది. దర్శక నిర్మాతలు క్యూ కడుతుండటంతో పారితోషికం విషయంలో భారీగా డిమాండ్ చేస్తుందట. సినిమాల్లో సక్సెస్‌ ఫుల్‌ గా సాగిపోతున్నా వ్యక్తిగత జీవితం లో మాత్రం ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంది. దీనికి కారణం బాయ్‌ఫ్రెండ్లకు బ్రేకప్ చెప్పడమే. ఒకరు హీరో శింబు కాగా - మరొకరు డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా. మొదటి లవర్‌ ని ముందే వదిలించుకొని ప్రభుదేవాను మాత్రం పెళ్లి పీటలెక్కే ముందు వదిలేసింది.

అనంతరం నయనతార జీవితంలోకి యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ ఎంటరయ్యాడు. ‘నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. వీళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరూ బహిరంగంగానే ఒప్పుకున్నారు. అప్పటి నుంచి హాలీడే ట్రిప్‌ లకు వెళ్తూ తరచూ కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు. ఇంతలో విఘ్నేష్‌ తో నయన్ పెళ్లి అని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నయనతార సంచలన నిర్ణయం తీసుకుందట. విఘ్నేష్ కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి పెంచడంతో నయనతార బలవంతంగా ఓకే అన్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో నయన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని నెట్టింట్లో హల్ చల్ నడుస్తుంది.
Tags:    
  • Nayanthara Vignesh Shivn Marriage Date Fixed 
  • Nayanthara Vignesh Shivn Marriage 
  • Nayanthara Marriage 
  • Kollywood Actress 
  • Tollywood Actress 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Tupaki News 
  • Tupaki Upd 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS