కట్టప్ప ఎందుకు చంపాడో బిజ్జాలదేవుడు చెప్పేశాడు

Update: 2017-03-28 18:07 GMT
కోట్లాది మందిని వెంటాడి వేధిస్తున్న ఒక ప్రశ్నకు బాహుబలి ఫేం బిజ్జాల దేవ అలియాస్ నాజర్ తనదైన శైలిలో సమాధానం చెప్పేశారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారంటూ ఎళ్లుగా వేధిస్తున్న ప్రశ్నను.. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కు హాజరైన నాజర్ ను ప్రశ్నించారు మీడియా ప్రతినిధి ఒకరు.  ఊహించని రీతిలో సమాధానం చెప్పేందుకు రెఢీ అయిన ఆయన.. ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారు.. డైరక్టర్ చంపమన్ను.. అందుకేకట్టప్ప బాహుబలిని చంపేశాడంటూ వ్యాఖ్యనించారు.

మంచి సినిమాను భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఆదరించే రోజులు వచ్చాయన్న ఆయన.. బిజ్జాల దేవుడు బాహుబలి2లో గోడను ఎందుకు పగలగొడతాడంటూ అడిగినప్రశ్నకు మాత్రం రహస్యం అంటూ సమాధానం చెప్పకుండా దాటేశారు. దీనికికూడా.. ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారు.. డైరెక్టర్ పగలగొట్టేయమన్నాడు.. కొట్టేశారని చెబితే సరిపోయేదేమో..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News