• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రామిస్...

ప్రామిస్ నిలబెట్టుకున్నానని నాని సంబరం

By - Tupaki Desk
Update: 2015-11-22 06:42 GMT
సరిగ్గా ఏడాది వెనక్కి వెళ్తే నాని దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఏడాది ఆరంభంలో వచ్చిన పైసా - ఆహా కళ్యాణం.. రెండూ కూడా పెద్ద ఫ్లాపయ్యాయి. ఇంకో సినిమా ‘జెండా పై కపిరాజు’ అయితే విడుదలకే నోచుకోలేదు. దీంతో నాని కెరీర్ డైలమాలో పడిపోయింది. ఆ సమయంలోనే హుద్ హుద్ తుపాను బాధితుల కోసం నిర్వహించిన ‘మేముసైతం’ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నాడు నాని. ఆ మ్యాచ్ లో 2 బంతులే ఆడి 0 పరుగులే చేశాడు నాని. తన ఆటకు, సినిమా కెరీర్ కు ముడిపెడుతూ అప్పట్లో ఓ ట్వీట్ పెట్టాడు నాని.

ఆ ట్వీట్లో.. ‘‘మేము సైతం మ్యాచ్ లో 2 బంతులాడా.. స్కోర్ 0. ఈ ఏడాది 2 సినిమాలు రిలీజయ్యాయి. స్కోర్ 0. ఈసారి బాగా ఆడతాను. చాలా బాగా.. ప్రామిస్’’ అని పేర్కొన్నాడు నాని. కట్ చేస్తే.. ఈ ఏడాది నాని భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు ఎవడే సుబ్రమణ్యం లాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ రెండు సినిమాలూ ‘ఐఐఎఫ్ ఏ ఉత్సవం’ అవార్డుల పోటీలో ఉన్న ఐదు సినిమాల్లో చోటు దక్కించుకోవడం విశేషం. ఓ అభిమాని నాని ఒకప్పుడు పెట్టిన ట్వీటుని గుర్తు చేస్తూ.. ఐఐఎఫ్ఏ ఉత్సవం కోసం షార్ట్ లిస్ట్ అయిన సినిమాల లిస్టు చూపిస్తూ ప్రామిస్ నిలబెట్టుకున్న నానికి కంగ్రాట్స్ చెప్పాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో అందరితో పంచుకుని సంబరాలు చేసుకున్నాడు నాని.
Tags:    
  • Nani 
  • Bhale Bhale Magadivoy movie 
  • Telugu NEWs 

Similar News

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS