• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీక్వెల్ ని లైట్...

సీక్వెల్ ని లైట్ తీసుకున్న‌ నాగార్జున‌?

By - Tupaki Desk
Update: 2019-11-19 04:20 GMT
అక్కినేని నాగార్జున న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. నాగ్ ద్విపాత్రాభిన‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర‌ లో సోగ్గాడి గా న‌టించి మెప్పించారు. ఈ చిత్రం దాదాపు 50 కోట్లు వ‌సూళ్ల‌ని సాధించి నాగ్ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 2016 జ‌న‌వ‌రి 15 విడుద‌లైన ఈ చిత్రానికి కొన‌సాగింపుగా `బంగార్రాజు` పేరుతో సీక్వెల్ చేయాల‌ని నాగార్జున ప్లాన్ చేశారు. క‌ల్యాణ్ కృష్ణ ఈ ప్రాజెక్టు కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న సంగ‌తి విదిత‌మే.

ఇంత‌కాలం ఈ సీక్వెల్ గురించి ర‌క‌ ర‌కాలుగా ప్ర‌చార‌మైంది. ఉంటుందా లేదా? అన్న‌దానిపైనా క్లారిటీ రాలేదు. ఇటీవ‌లి కాలం లో అయితే అస‌లు నాగ్ ఆ సీక్వెల్ మాట ఎత్త‌డం లేదు. ఆ మ‌ధ్య మీడియా అడిగితే..``క‌థ రెడీ అవుతోంది. తొలి భాగానికి మించి వుండాల‌ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం`` అని నాగార్జున చెప్పుకొచ్చారు. బంగార్రాజు మ‌న‌వ‌డి పాత్ర‌లో నాగ‌చైత‌న్య న‌టిస్తాడ‌ని కూడా ఇంత‌కు ముందు ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఇప్ప‌టికీ దీనిపై ఏ క్లారిటీ రాలేదు. సినిమా ఇంతవ‌ర‌కు ప‌ట్టాలెక్క‌లేదు. `నేల‌టిక్కెట్‌` ఫ్లాప‌వ్వ‌డంతో ద‌ర్శ‌కుడు కల్యాణ్ కృష్ణ‌ కు అది ఇబ్బందిక‌రం అయ్యింది. దీంతో నాగ్ `బంగార్రాజు` విష‌యం లో బ్యాక్ స్టెప్ తీసుకున్నాడ‌న్న‌ది తాజా వాద‌న‌. దీనికి బ‌లాన్ని చేకూరుస్తూ నాగార్జున తాజాగా మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. అది కూడా ఓ త‌మిళ ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

రామ్‌గోపాల్‌ వ‌ర్మ మాట‌లు న‌మ్మి `ఆఫీస‌ర్‌` సినిమా కోసం పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన నాగార్జున ఆ సినిమాతో భారీ డిజాస్ట‌ర్ ని చ‌విచూసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి నాగ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర కు ఓకే చెప్పార‌ట‌. ఈ చిత్రాన్ని త‌మిళ ద‌ర్శ‌కుడు సోల‌మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీల‌క స‌మాచారం త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్ న్యూస్‌.
Tags:    
  • Nagarjuna 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Tollywood Movie News 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS